అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పేకాట ఆడినందుకు ఇప్పటికే 81 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. పేకాట దాడుల్లో జిల్లాలో రూ.85,312 నగదు, 41 సెల్ఫోన్లు, 9 బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.
జిల్లాలో పేకాట స్థావరాలపై నిఘా కొనసాగుతుందన్నారు. గ్రామాలు, పట్టణాలు, ఫామ్ హౌస్‌లు (Farm House), ఇళ్లల్లో.. బహిరంగ ప్రదేశంలో జూదం, ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీస్ కంట్రోల్ రూం (Police Control Room) నెంబర్ 8712686133కు ఫోన్ చేయాలన్నారు. లేకపోతే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు, 100 డయల్‌కు సమాచారం అందించాలని కోరారు.
బోధన్ పట్టణంలో..
అక్షరటుడే, బోధన్: మండలంలో పేకాట ఆడుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై మచ్చేందర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం వివరాలు వెల్లడించారు. మండలంలోని అమ్దాపూర్‌లో పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించారు.
నలుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి రూ.6,180 స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా చిన్నమావంది గ్రామంలోనూ పేకాట స్థావరంపై దాడిచేసి నలుగురిని అదుపులోకి తీసుఉని వారివద్ద నుంచి రూ. 5వేల స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.