HomeతెలంగాణMinister Jupally | సీఎంఆర్​ ఎగవేతకు పాల్పడిన మిల్లులపై కఠినచర్యలు: మంత్రి

Minister Jupally | సీఎంఆర్​ ఎగవేతకు పాల్పడిన మిల్లులపై కఠినచర్యలు: మంత్రి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Minister Jupally | సీఎంఆర్​ ఎగవేతకు పాల్పడిన మిల్లులపై కఠినచర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) ఆదేశించారు. గురువారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం (joint district officials) నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో 44 రైస్ మిల్లులో (rice mills) రూ.200 కోట్ల సీఎంఆర్​ ఎగవేతకు గురైందని.. 48 రైస్ మిల్లులు రూ.100 కోట్లల్లో గోల్​మాల్​ జరిగిందన్నారు. వచ్చే ఆరు నెలల్లో డిఫాల్ట్ మిల్లర్ల నుంచి నిధులు రాబట్టే చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల (Indiramma houses) నిర్మాణానికి ఇసుకను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని వివరించారు.

గత ప్రభుత్వంతో పోలిస్తే 16 నెలల్లో కాంగ్రెస్ (Congress) ప్రజాపాలనలో స్పష్టమైన మార్పు వచ్చిందన్నారు. అలాగే రాజీవ్ యువ వికాసం పథకం (Rajiv Yuva Vikasam Scheme) లబ్ధిదారులకు జూన్ నుంచి విడతలవారీగా యూనిట్లను మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

భూభారతికి సంబంధించి ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు పూర్తయ్యాయని చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government Advisor Shabbir Ali), ఎమ్మెల్యేలు ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta), భూపతిరెడ్డి, మదన్​మోహన్​, వ్యవసాయ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్​బిన్​ హందాన్​, నుడా ఛైర్మన్ కేశవేణు, నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశిష్ సంగ్వాన్ సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

Must Read
Related News