అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | పశువుల అక్రమ రవాణాను నివారించేందుకు జిల్లాలో ఏడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని ఎస్పీ రాజేష్ చంద్ర kamareddy SP Rajesh chandra తెలిపారు. బుధవారం ఆయన మాచారెడ్డి (Machareddy) మండలం ఘనపూర్, భిక్కనూరు (Bhiknoor) మండలం టోల్ ప్లాజా, బస్వాపూర్ (Baswapur) చెక్ పోస్టులను తనిఖీ చేశారు.
చెక్‌పోస్టుల వద్ద వాహనాల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద 24 గంటల నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. పోలీసు శాఖతో పాటు ఇతర శాఖల సిబ్బంది సమన్వయంతో షిఫ్ట్‌ల వారీగా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఏ వ్యక్తి లేదా సంస్థ స్వయంగా వాహనాలను ఆపకూడదని.. అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.