అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డి ఎస్సై బొజ్జ మహేశ్ (Yellareddy SI Bojja Mahesh) అన్నారు. పట్టణంలో బుధవారం రాత్రి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఎస్సై ఆధ్వర్యంలో భారీ స్థాయిలో వాహన తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా వేశారు.
ఎస్సై బొజ్జ మహేష్ మాట్లాడుతూ.. మద్యం సేవించి డ్రైవింగ్ (drunk driving) చేయడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే అన్నారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ వంటి అవసరమైన పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, పెండింగ్‌లో ఉన్న చలాన్లు వెంటనే చెల్లించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
