ePaper
More
    HomeతెలంగాణStreet Vendor's GHMC |​ పోలీసులు వేధిస్తున్నారని వీధి వ్యాపారుల ఆందోళన

    Street Vendor’s GHMC |​ పోలీసులు వేధిస్తున్నారని వీధి వ్యాపారుల ఆందోళన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Street vendors GHMC | హైదరాబాద్​(Hyderabad)లో వీధి వ్యాపారులు సోమవారం ఆందోళన చేపట్టారు. పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే తమను ట్రాఫిక్​ పోలీసులు(Traffic police) వేధిస్తున్నారని నిరసన తెలిపారు.

    ఈ మేరకు జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలోకి చొచ్చుకొచ్చి ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్​ పోలీసులు నిత్యం షాపులు తొలగించడంతో పాటు, చలాన్లు(Challans) వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజంతా పని చేసి రూ.500 నుంచి రూ.1,000 సంపాదించుకునే తమకు రూ.వేలల్లో జరిమానాలు వేస్తున్నారని వాపోయారు. అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

    కాగా.. GHMC పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ పై ఫోకస్ పెట్టారు. ప్రధానంగా రోడ్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తున్నారు. ఈ క్రమంలోనే స్ట్రీట్ వెండర్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.

    More like this

    Nepal | నేపాల్‌ లో విధ్వంసం.. అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లకు నిప్పు.. పలువురు మంత్రులపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌ లో రెండోరోజూ విధ్వంసకాండ కొనసాగింది. యువత ఆందోళనలతో హిమాయల దేశం...

    CP Sai Chaitanya | పోలీస్​ ఇమేజ్​ పెంచేవిధంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitanya | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీస్​ ఇమేజ్​ను పెంచే విధంగా సిబ్బంది...

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం...