Homeజిల్లాలునిజామాబాద్​Dogs Bite | వీధి కుక్క దాడిలో 27 మందికి గాయాలు..

Dogs Bite | వీధి కుక్క దాడిలో 27 మందికి గాయాలు..

అక్షరటుడే, ఆర్మూర్​: Dogs Bite | వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. జిల్లాలో తరచూ కుక్క కాటుతో పలువురు గాయాల పాలవుతున్నారు. ముఖ్యంగా చిన్నారులను కుక్కలు వెంటపడి మరీ కరుస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Dogs Bite | ఆర్మూర్​లోని మామిడిపల్లిలో..

మామిడిపల్లిలో మంగళవారం రాత్రి ఓ వీధి కుక్క (Street Dogs) 27 మందిని కరిచింది. ఇందులో చిన్న పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. స్పందించిన కుటుంబీకులు స్థానికులు వెంటనే వారిని ఆర్మూర్​ ప్రభుత్వ ఆస్పత్రికి (Armoor Government Hospital) తరలించి చికిత్స చేస్తున్నారు.

ఆర్మూర్ పట్టణంలోని అన్ని కాలనీల్లోనూ సుమారు 20 నుంచి 30 కుక్కలు గుంపులుగుంపులుగా తిరుగుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు (Municipal Officers) ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటి కారణంగా రాత్రివేళ్లలో అత్యవసర పరిస్థితుల్లో బయటకు కూడా వెళ్లలేని పరిస్థితులు తయారయ్యాయని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తున్నారు.