ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిDog Bite | వీధి కుక్కల స్వైర విహారం: ఇరవై మందికి గాయాలు..

    Dog Bite | వీధి కుక్కల స్వైర విహారం: ఇరవై మందికి గాయాలు..

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Dog Bite | రాజంపేట మండల (Rajampet mandal) కేంద్రంలోని శ్రీ శారదా శిశు మందిర్ పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల విద్యార్థిపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థి ధనుంజయ్ (4) మూత్ర విసర్జనకు బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో అటుగా వచ్చినటువంటి వీధి కుక్కలు (stray dogs) ఒకసారిగా బాలుడిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయాలపాలయ్యాడు.

    విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది కుక్కలను తరిమే ప్రయత్నం చేయగా ఉపాధ్యాయురాలిపై సైతం దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలైన విద్యార్థిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి (Kamareddy District Hospital) తరలించారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో విద్యార్థికి చికిత్స కొనసాగుతోంది.

    Dog Bite | కామారెడ్డి పట్టణంలో..

    కామారెడ్డి పట్టణంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా దాడులకు పాల్పడుతున్నాయి. శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని (Kamareddy town) పలు కాలనీలలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. పలు కాలనీల్లో పలువురిపై దాడికి పాల్పడింది. పిచ్చికుక్క దాడిలో దాదాపు 20 మందికి గాయలైనట్టుగా తెలుస్తోంది. గాయపడిన వారు జిల్లా ఆస్పత్రికి చికిత్స కోసం పరుగులు తీశారు.

    Latest articles

    Tirumala | ఏఐ టెక్నాల‌జీతో వేగంగా శ్రీవారి దర్శనం.. టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | భక్తుల భాగస్వామ్యంతో స‌నాత‌న ధ‌ర్మ‌ ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని టీటీడీ ఛైర్మ‌న్...

    Mahindra | మహీంద్రా ‘గ్లోబల్ విజన్ 2027’ ఆవిష్కరణ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahindra | మాడ్యులర్, మల్టీ-ఎనర్జీ NU_IQ ప్లాట్ఫామ్ ఆధారంగా ప్రపంచాన్ని ఆకట్టుకునే నాలుగు SUV...

    Jeevan Reddy | తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు

    అక్షర టుడే, ఆర్మూర్‌ : Jeevan Reddy | కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు వచ్చాయని...

    Mahammad nagar | పంద్రాగస్టు రోజు యథేచ్ఛగా మద్యం విక్రయాలు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Mahammad nagar | స్వాతంత్య్ర దినోత్సవం రోజు యథేచ్ఛగా మద్యం విక్రయాలు కొనసాగాయి. ఎక్సైజ్​శాఖ (Excise...

    More like this