HomeజాతీయంSupreme Court | వీధి కుక్కల కేసు.. సుప్రీం కీలక ఆదేశాలు

Supreme Court | వీధి కుక్కల కేసు.. సుప్రీం కీలక ఆదేశాలు

వీధి కుక్కల కేసులో సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో పాటు ఇతర బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని స్పష్టంచేసింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Supreme Court  | వీధి కుక్కల కేసులో (stray dog ​​case) దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీం కోర్టు (Supreme Court) స్పష్టంచేసింది. విద్యాసంస్థలు (educational institutions), క్రీడా సముదాయాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఇతర జనావాస ప్రదేశాల నుంచి తరలించాలని ఆదేశించింది.

అంతేకాకుండా బహిరంగ ప్రదేశాలకు వెళ్లకుండా కంచెలు వేయాలని సూచించింది. కుక్కలు లేవని నిర్ధారించుకునేందుకు క్రమంతప్పకుండా తనిఖీలు చేయాలని చెప్పింది. ఏ కారణంతోనైనా మళ్లీ వాటిని పట్టుకున్న చోటనే వదిలివేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.

Supreme Court  | దేశ​ పరువు తీస్తున్నారని ఇటీవల సుప్రీం ఆగ్రహం

దేశంలో వీధి కుక్కల దాడులు పెరుగుతున్నా.. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఇటీవల సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కుక్కల బెడదతో విదేశాల్లో భారత్‌ను చెడుగా చిత్రీకరిస్తున్నారని వ్యాఖ్యానించింది. దేశంలో వీధికుక్కల (stray dogs) బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని న్యాయస్థానం తెలిపింది. కాగా.. కుక్కల బెడద నివారణకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టడం లేదని దాఖలైన పిటిషన్​పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా నేడు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Must Read
Related News