అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Dog Attack | వీధికుక్క దాడి చేయడంలో ఓ చిన్నారి గాయపడ్డ ఘటన నగరంలో గురువారం చోటు చేసుకుంది. 50వ డివిజన్లోని గాజుల్పేట్లో (Gajulpet) ఉదయం ఇంటి ఎదుట ఆడుకుంటున్న చిన్నారి మహేశ్వరిపై వీధికుక్క ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో గమనించిన కుటుంబసభ్యులు కుక్కను తరిమేశారు. చిన్నారికి తీవ్ర గాయాలవడంతో వెంటనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
