5
అక్షరటుడే, లింగంపేట: Kamareddy | కామారెడ్డి జిల్లాలో వింత చేప ప్రత్యక్షమైంది. లింగంపేట(Lingmapet) మండలం పర్మల్ల తండాలో(Parmalla Thanda) సోమవారం ఈ చేప లభ్యమైంది. అంబర్ సింగ్కు చెందిన పంట పొలంలోని వ్యవసాయ బావిలో ఇది కనిపించింది. తెలుపు, నలుపు చారలు కలిగి ఉండడంతో పాటు చేపంతా వాడిగా ముళ్లు ఉన్నాయి. అంతేకాకుండా దీని కళ్లు కూడా భయంకరంగా ఉండడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. అయితే దీనిని సుకర్ పిష్ అంటారని.. ఇవి సముద్రంలో అరుదుగా కనిపిస్తాయని తెలుస్తోంది. దీనిని కొన్ని ప్రాంతాల్లో దెయ్యం చేప, రాకాసి చేప అని కూడా అంటుంటారు. ఇది చెరువులోని ఇతర చేపల్ని, జీవుల్నీ, మాంసాన్ని కూడా తింటుందని చెబుతుంటారు.