HomeతెలంగాణCherlapalli Terminal | ఈదురు గాలుల బీభత్సం.. చర్లపల్లి టెర్మినల్​లో కూలిన ఫాల్ సీలింగ్

Cherlapalli Terminal | ఈదురు గాలుల బీభత్సం.. చర్లపల్లి టెర్మినల్​లో కూలిన ఫాల్ సీలింగ్

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Cherlapalli Terminal : జీహెచ్​ఎంసీ పరిధి హైదరాబాద్​లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలులతో కూడిన వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. చర్లపల్లి టెర్మినల్‌లో పనులు జరుగుతున్న చోట ఈదురు గాలులకు రేకులు ఎగిరిపడ్డాయి. ఫాల్​ సీలింగ్​ కుప్పకూలింది.

కుషాయిగూడలోనూ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో క్యుములోనింబస్​ మేఘాలు కమ్ముకున్నాయి. మల్కాజ్ గిరి, ఉప్పల్, తార్నాక, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్ లాంటి ప్రాంతాల్లో వర్షం పడింది.