అక్షరటుడే, వెబ్డెస్క్ : Nizamabad | నిజామాబాద్ (Nizamabad) నగరంలో సోమవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా ఈదురుగాలులు భారీ వేగంతో వీయడంతో చెట్లు విరిగి పడ్డాయి. కరెంట్ స్తంభాలు నేలకూలడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అలాగే పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. గంగాస్థాన్లో గల ఎస్ఆర్ కాలేజీ (SR Junior College) సమీపంలో ఓ చెట్టు కూలి బైక్లు ధ్వంసం అయ్యాయి. చెట్టు కరెంట్ తీగలపై పడటంతో విద్యుత్ స్తంభం కూడా విరిగిపోయింది.
