HomeతెలంగాణWeather Updates | పొంచి ఉన్న తుపాన్​ ముప్పు.. నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

Weather Updates | పొంచి ఉన్న తుపాన్​ ముప్పు.. నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

Weather Updates | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపాన్​గా మారనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపాన్​గా మారనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

వాయుగుండం రాబోయే 24 గంటల్లో తుపానుగా మారనుంది. మొంథా తుపాన్​ (Cyclone Montha) ఏపీలోని కాకినాడ (Kakinada) సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. కాగా దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. వికారాబాడ్​, మెదక్​, సంగారెడ్డి, నిజామాబాద్​, కామారెడ్డి, మహబూబ్​నగర్​, వనపర్తి, గద్వాల్​, నారాయణపేట, నాగర్​కర్నూల్​, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మిగతా ప్రాంతాల్లో చిరుజల్లులు పడతాయి. హైదరాబాద్​ (Hyderabad) నగరంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయి.

Weather Updates | వర్షంతో రైతుల తిప్పలు

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం (Heavy Rain) కురిసింది. ఉదయం నుంచి వర్షం పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా అకాల వర్షాలతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఆరబెట్టిన ధాన్యం తడిసిపోతుందని ఆందోళన చెందుతున్నారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు పలు చోట్ల జల్లులు పడ్డాయి.

Weather Updates | ఏపీలో అప్రమత్తం

మొంథా తుఫాన్‌ దూసుకు వస్తుండటంతో ఏపీలో అధికారులు అప్రమత్తం అయ్యారు. కాకినాడ సమీపంలో తుపాన్​ తీరం దాటే అవకాశం ఉంది. దీంతో కాకినాడ- ఉప్పాడ బీచ్‌ రోడ్డును అధికారులు మూసివేశారు. తుపాన్‌ ప్రత్యేక అధికారిగా ఐఏఎస్‌ కృష్ణ చైతన్యను నియమించారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. తుపాన్​ ప్రభావిత ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. పలు జిల్లాల్లో అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ రోజు నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.