అక్షరటుడే, వెబ్‌డెస్క్: Migraine | ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల తలనొప్పి, మైగ్రేషన్(Migraine) సమస్యలు చాలా సాధారణమైపోయాయి. చాలామంది ఈ నొప్పి నుంచి ఉపశమనం కోసం టాబ్లెట్‌లను ఆశ్రయిస్తుంటారు. అయితే, ఇలా తరచూ మందులు వాడటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
ఈ సమస్యలను మన వంటగదిలో ఉండే ఒక పదార్థంతోనే సులభంగా తగ్గించుకోవచ్చు. అదే, పుల్లపుల్లగా ఉండే చింతపండు(Tamarind). దీనిలోని కొన్ని ప్రత్యేక గుణాలు తలనొప్పికి, మైగ్రేన్‌కు ఒక సహజమైన ఔషధంగా పనిచేస్తాయి. చింతపండులో ఉండే మాలిక్, టార్టారిక్ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి పోషకాలు శరీరానికి చలువ చేసి, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. చింతపండును సరైన పద్ధతిలో వాడితే, నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
Migraine | తలనొప్పి తగ్గించేందుకు చింతపండును ఇలా వాడండి:
నుదుటిపై చింతపండు పేస్ట్: ఇది చాలా పురాతనమైన, ప్రభావవంతమైన చిట్కా. ముందుగా ఒక చిన్న చింతపండు(Tamarind) ముక్కను తీసుకుని కొన్ని నిమిషాలు నీటిలో నానబెట్టండి. తర్వాత దాని గుజ్జును మెత్తగా పేస్ట్ చేసి నుదుటిపైనా రాయండి. చింతపండుకు సహజంగా చల్లబరిచే గుణం ఉంటుంది. ఇది ఒత్తిడి వల్ల రక్తనాళాలు (blood vessels) బిగుసుకుపోతే వాటిని శాంతపరిచి, తలనొప్పిని తగ్గిస్తుంది. పేస్ట్ పూర్తిగా ఆరిన తర్వాత మళ్లీ అదే పని చేయవచ్చు. ఈ పద్ధతి మెడ నొప్పి, తల తిరగడం (neck pain and dizziness) వంటి సమస్యలకు కూడా పనిచేస్తుంది.
చింతపండు రసం: ఒక గ్లాసు నీటిలో కొద్దిగా చింతపండును నానబెట్టండి. అందులో కొద్దిగా బెల్లం లేదా ఉప్పు కలిపి తాగండి. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను సరిచేసి, డీహైడ్రేషన్ లేదా ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పిని తగ్గిస్తుంది. చింతపండులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. బెల్లం కలిపిన చింతపండు రసం జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం వంటి సమస్యల వల్ల వచ్చే తలనొప్పిని కూడా తగ్గిస్తుంది.
వేడి చింతపండు పేస్ట్: కొన్నిసార్లు తలనొప్పి చలి వల్ల రావచ్చు. అలాంటి సందర్భాల్లో, చింతపండు పేస్ట్‌ను కొద్దిగా వేడి చేసి నుదుటిపై పెట్టుకోవడం వల్ల రక్త ప్రసరణ (blood circulation) మెరుగుపడి, మంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ చిట్కాలు మైగ్రేషన్ (Migraine) నొప్పి తీవ్రతను కూడా తగ్గించడంలో సహాయపడతాయి. అయితే, ఈ చిట్కాలు కేవలం తాత్కాలిక ఉపశమనం కోసమే. సమస్య తీవ్రంగా ఉంటే లేదా తరచుగా వస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి. అనవసరంగా టాబ్లెట్‌లు వాడకుండా, ఇలాంటి సహజ చిట్కాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.