Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | చోరీ బైకు అమ్మకం ఘటన.. కానిస్టేబుల్​పై​ తీవ్ర అవినీతి ఆరోపణలు

Kamareddy | చోరీ బైకు అమ్మకం ఘటన.. కానిస్టేబుల్​పై​ తీవ్ర అవినీతి ఆరోపణలు

కామారెడ్డి పట్టణ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని చోరీ కేసులో పట్టుబడిన బైకును అమ్మిన ఘటన కలకలం రేపుతోంది. ఇందులో కీలకపాత్ర పోషించిన కానిస్టేబుల్​పై అనేక ఆరోపణలు ఉన్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Kamareddy | కామారెడ్డి పట్టణ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని చోరీ కేసులో పట్టుబడిన బైకును అమ్మిన ఘటన కలకలం రేపుతోంది. 2024లో నమోదైన ఓ కేసులో 29 టూవీలర్లను అప్పటి పోలీసులు రికవరీ చేశారు. కాగా.. ఇందులో ఓ బైకు తాజాగా పోలీసులకు వాహనాల తనిఖీల్లో పట్టుబడడం.. తీరా కానిస్టేబులే సదరు వాహనాన్ని అమ్మినట్లు గుర్తించడం చర్చకు దారితీసింది.

Kamareddy | అసలేం జరిగిందంటే..

కామారెడ్డి పట్టణ పోలీస్​ స్టేషన్​ పరిధిలో క్రైం నంబర్​ 29/2024లో బైకు దొంగతనాలకు సంబంధించిన కేసు నమోదై ఉంది. కాగా.. వివిధ ప్రాంతాల నుంచి దొంగతనం చేసిన 29 టూ వీలర్లను అప్పటి సీఐ చంద్రశేఖర్​ రెడ్డి ఆధ్వర్యంలో రికవరీ చేశారు. ఇందులో కొన్ని టెంపరరీ రిజిస్ట్రేషన్లు, నంబర్​ ప్లేట్లు లేని వాహనాలుగా గుర్తించారు. వీటిలో కొన్నింటిని సేఫ్​ కస్టడీ నిమిత్తం కామారెడ్డి పోలీస్​ స్టేషన్​లో ఉంచారు. కాగా.. గతంలో పనిచేసిన ఓ అధికారి, మరో కానిస్టేబుల్​ కలిసి ఓ టూ వీలర్​ను అమ్ముకున్నట్లు గుర్తించారు. సదరు మైలార్​ దేవునిపల్లికి చెందిన వ్యక్తిది కాగా.. సదరు వాహనం చోరీకి గురైందని.. అనంతరం కామారెడ్డి పట్టణ పోలీస్​ స్టేషన్​లోనే రికవరీ అయ్యింది. అయితే సదరు వాహన యజమానికి ఇప్పటి వరకు బండి ఇవ్వలేదు. మరోవైపు పోలీస్​ సేఫ్​ కస్టడీ ఉంచాల్సి ఉండగా.. దానిని అమ్ముకున్నారు.

Kamareddy | కానిస్టేబుల్​పై ఆరోపణలెన్నో..

ఈ మొత్తం వ్యవహారంలో కానిస్టేబుల్​ విశ్వనాథ్​ కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సీఐ చంద్రశేఖర్​ రెడ్డి హయాంలో సదరు కానిస్టేబుల్​ చేతుల మీదుగానే అన్ని రకాల లావాదేవీలు, అక్రమ వసూళ్లు, సెటిల్​మెంట్లలో కీలకంగా వ్యవహరించారు. పలుమార్లు ఏసీబీ ట్రాప్​ నుంచి తప్పించుకున్నట్లు ప్రచారంలో ఉంది. గతంలో అనేక ఫిర్యాదులు వెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు లేకుండా అప్పటి సీఐ కాపాడినట్లు సమాచారం. కాగా.. సదరు కానిస్టేబుల్​ను ఇటీవల గాంధారికి బదిలీ చేశారు. బైకు అమ్మిన విషయం వెలుగులోకి రావడంతో ఈ ఘటనను ఎస్పీ రాజేష్​ చంద్ర సీరియస్​గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. అప్పటి ఎస్​హెచ్​వోగా వ్యవహరించిన అధికారిపై ఎలాంటి చర్యలు ఉంటాయో వేచిచూడాలి.

Must Read
Related News