అక్షరటుడే, వెబ్డెస్క్ : Stock Market | ట్రంప్ టారిఫ్(Trump tariffs) భయాలు, యూఎస్, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం విషయంలో అనిశ్చితి కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ఎఫ్ఐఐ(FII)ల అమ్మకాలు.. దేశీయ స్టాక్ మార్కెట్ ను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్(Sensex) 145 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా.. అక్కడ నుంచి 72 పాయింట్లు పెరిగింది. అనంతరం అమ్మకాల ఒత్తిడితో 539 పాయింట్లు నష్టపోయింది. 52 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ(Nifty).. అక్కడి నుంచి 41 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే(Intraday) గరిష్టాల నుంచి 177 పాయింట్లు పతనమైంది. మధ్యాహ్నం 12.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 587 పాయింట్ల నష్టంతో 80,034 వద్ద, నిఫ్టీ 181 పాయింట్ల నష్టంతో 24,414 వద్ద కదలాడుతున్నాయి.
Stock Market | ఆయిల్, ఎనర్జీ సెక్టార్లు మినహా..
ఎనర్జీ(Energy), ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లు మినహా మిగతా రంగాల షేర్లన్నీ అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. బీఎస్ఈ(BSE)లో ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.39 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 0.11 శాతం పెరిగాయి. మెటల్(Metal) ఇండెక్స్ 1.37 శాతం, టెలీకాం 1.35 శాతం, కమోడిటీ 1.02 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.97 శాతం, రియాల్టీ 0.96 శాతం, బ్యాంకెక్స్ 0.82 శాతం నష్టాలతో ఉన్నాయి.
Top Gainers :బీఎస్ఈ సెన్సెక్స్ లో 9 కంపెనీలు లాభాలతో ఉండగా.. 21 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. టైటాన్(Titan), ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, మారుతి, ట్రెంట్ లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఎయిర్టెల్, ఆక్సిస్ బ్యాంకు, టాటా స్టీల్, అదాని పోర్ట్స్, రిలయన్స్ నష్టాల బాటలో సాగుతున్నాయి.
