Homeబిజినెస్​Stock Market | లాభాలబాట పట్టిన స్టాక్‌ మార్కెట్లు

Stock Market | లాభాలబాట పట్టిన స్టాక్‌ మార్కెట్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Stock Market | మార్కెట్‌లో అస్థిరతలు(Uncertainty) కొనసాగుతున్నాయి. యూఎస్‌, భారత్‌ల మధ్య ట్రేడ్‌ కొలిక్కి రాకపోవడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ఎఫ్‌ఐఐల అమ్మకాలు వంటి పరిణామాలతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ సాగుతున్నాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 257 పాయింట్లు లాభంతో ప్రారంభమైంది. అక్కడినుంచి మరో 24 పాయింట్లు మాత్రమే పెరిగి నష్టాల బాట పట్టింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 431 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 69 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా నిలదొక్కుకోలేకపోయింది. ఇంట్రాడే(Intraday) గరిష్టాలనుంచి కొద్దిసేపటికే 121 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 151 పాయింట్ల లాభంతో 81,489 వద్ద, నిఫ్టీ(Nifty) 40 పాయింట్ల లాభంతో 24,861 వద్ద కదలాడుతున్నాయి.

Stock Market | మిక్స్‌డ్‌గా సూచీలు..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లోని సూచీలు మిక్స్‌డ్‌గా ట్రేడ్‌ సాగుతున్నాయి. బీఎస్‌ఈలో ఇండస్ట్రియల్‌(Industrial) ఇండెక్స్‌ 1.12 శాతం లాభంతో ఉండగా.. యుటిలిటీ 0.77 శాతం, ఇన్‌ఫ్రా ఇండెక్స్‌ 0.71 శాతం, పవర్‌ 0.55 శాతం, కమోడిటీ 0.53 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌ 0.42 శాతం లాభాలతో ఉన్నాయి. ఆటో ఇండెక్స్‌(Auto index) 0.58 శాతం, రియాలిటీ ఇండెక్స్‌ 0.30 శాతం నష్టాలతో కొనసాగుతున్నాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.31 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.19 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.06 శాతం లాభాలతో కదలాడుతున్నాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 19 కంపెనీలు లాభాలతో ఉండగా.. 11 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఎల్‌అండ్‌టీ 4.18 శాతం, ఎన్టీపీసీ 1.82 శాతం, ట్రెంట్‌ 1.39 శాతం, సన్‌ఫార్మా 1.30 శాతం, మారుతి 1.12 శాతం లాభాలతో సాగుతున్నాయి.

Top Losers : టాటా మోటార్స్‌ 2.90 శాతం, హెచ్‌యూఎల్‌ 1.43 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 0.85 శాతం, ఎంఅండ్‌ఎం 0.56 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 0.46 శాతం నష్టాలతో ఉన్నాయి.

Must Read
Related News