Homeబిజినెస్​Stock Market | దూసుకుపోయిన స్టాక్‌ మార్కెట్లు.. 25 వేల మార్క్‌పైన నిలబడిన నిఫ్టీ

Stock Market | దూసుకుపోయిన స్టాక్‌ మార్కెట్లు.. 25 వేల మార్క్‌పైన నిలబడిన నిఫ్టీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Stock Market | ఆర్‌బీఐ రేట్‌ కట్‌ నిర్ణయం వెలువరించిన తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్లు దూసుకుపోయాయి. బ్యాంక్‌ నిఫ్టీ (Bank nifty) ఆల్‌టైం హైకి చేరింది. నిఫ్టీ సైతం 25 వేల మార్క్‌ను దాటి నిలబడిరది. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్‌ నేపథ్యంలో శుక్రవారం మన మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సూచీలు తొలుత ఒత్తిడిని ఎదుర్కొని నష్టాల బాటలో పయనించాయి.

సెన్సెన్స్‌ (Sensex) 302 పాయింట్లు, నిఫ్టీ 79 పాయింట్లు నష్టపోయాయి. ఆర్‌బీఐ(RBI) వడ్డీ రేట్లను 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో పాటు సీఆర్‌ఆర్‌ను నాలుగు విడతల్లో వంద బేసిస్‌ పాయింట్లు తగ్గించనున్నట్లు ప్రకటించడంతో స్టాక్‌ మార్కెట్‌ నూతనోత్సాహంతో పరుగులు తీసింది. ఇంట్రాడే కనిష్టాలనుంచి సెన్సెక్స్‌ 1,159 పాయింట్లు, నిఫ్టీ (Nifty) 358 పాయింట్లు పెరిగాయి. చివరికి సెన్సెక్స్‌ 746 పాయింట్ల లాభంతో 82,188 వద్ద, నిఫ్టీ 252 పాయింట్ల లాభంతో 25,003వద్ద స్థిరపడ్డాయి.


బీఎస్‌ఈ(BSE)లో 2,278 కంపెనీలు లాభపడగా.. 1,744 స్టాక్స్‌ నష్టపోయాయి. 134 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 119 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 43 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 13 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 6 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌(Lower circuit)ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం విలువ రూ.2.73 లక్షల కోట్లు పెరిగింది.

Stock Market | క్యాపిటల్‌ గూడ్స్‌లో అమ్మకాల ఒత్తిడి..

క్యాపిటల్‌ గూడ్స్‌ (Capital goods), పీఎస్‌యూ బ్యాంక్‌ సెక్టార్లు మినహా మిగతా అన్ని రంగాల షేర్లు లాభాల బాటలో పయనించాయి. బీఎస్‌ఈలో క్యాపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ 0.30 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.09 శాతం నష్టపోయాయి. రియాలిటీ (Realty) ఇండెక్స్‌ 4.74 శాతం పెరగ్గా.. మెటల్‌ ఇండెక్స్‌ 1.56 శాతం, ఆటో ఇండెక్స్‌ 1.50 శాతం, బ్యాంకెక్స్‌ 1.25 శాతం, ఇన్‌ఫ్రా ఇండెక్స్‌ 0.96 శాతం లాభపడ్డాయి. ఐటీ, ఎనర్జీ సెక్టార్లూ రాణించాయి. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.04 శాతం, మిడ్‌ క్యాప్‌ 0.91 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.43 శాతం పెరిగాయి.

Stock Market | Top Gainers..

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 28 స్టాక్స్‌ లాభాలతో, 2 స్టాక్స్‌ మాత్రమే నష్టాలతో ముగిశాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ (Baja finance) 4.93 శాతం పెరగ్గా.. యాక్సిస్‌ బ్యాంక్‌ 3.15 శాతం, మారుతి 2.64 శాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 2.50 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2.36 శాతం లాభపడ్డాయి.

Stock Market | Losers..

ఎయిర్‌టెల్‌(Airtel) 0.39 శాతం, సన్‌ఫార్మా 0.20 శాతం నష్టపోయాయి.

Must Read
Related News