అక్షరటుడే, వెబ్‌డెస్క్:Stock market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) మూడు రోజుల వరుస నష్టాలనుంచి తేరుకుని లాభాలబాట పట్టాయి. ఉదయం సెన్సెక్స్ 40 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమై ఇంట్రాడేలో గరిష్టంగా 350 పాయింట్లు పెరిగిం. 18 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ.. గరిష్టంగా 102 పాయింట్లు లాభపడిర. చివరికి సెన్సెక్స్ 260 పాయింట్ల లాభంతో 80,998 వద్ద, నిఫ్టీ 77 పాయింట్ల లాభంతో 24,620 వద్ద స్థిరపడ్డాయి.
బీఎస్‌ఈలో 2,071 కంపెనీలు లాభపడగా 1,933 స్టాక్స్ నష్టపోయాయి. 151 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 112 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 47 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 10 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
రియాలిటీ మినహా మిగతా రంగాల షేర్లు లాభాల బాటలో పయనించాయి. బీఎస్‌ఈ(BSE)లో రియాలిటీ ఇండెక్స్ 0.77 శాతం నష్టపోయిం. బ్యాంకెక్స్ స్వల్ప నష్టాలతో ముగిసిం. టెలికాం సూచీ 1.38 శాతం పెరగ్గా.. ఇన్‌ఫ్రా 0.89 శాతం, ఎనర్జీ 0.69 శాతం, మెటల్ ఇండెక్స్(Index) ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లు 0.5 శాతానికిపైగా లాభపడ్డాయి. మిడ్ క్యాప్ 0.76 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.58 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.31 శాతం పెరిగాయి.
Stock Markets | సూచీలు ఎందుకు పెరిగాయంటే..
టారిఫ్(Tariff)ల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అద్యక్షుడు జిన్‌పింగ్ ఈ వారంలో ఫోన్ ద్వారా చర్చించే అవకాశాలు ఉండడంతో మార్కెట్‌లో పాజిటివ్ సెంటిమెంట్ బలపడుతోం. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య ఉక్త్రతలు తగ్గుతాయన్న అంచనాలతో గ్లోబల్ మార్కెట్లు రాణించాయి. మరోవైపు ఆర్‌బీఐ(RBI) ఎంపీసీ మీటింగ్ ప్రారంభమైంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండడంతో వడ్డీ రేట్లను తప్పనిసరిగా తగ్గిస్తారన్న అంచనాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రెండు రేట్ కట్ ప్రకటనలు ఉంటాయన్న అంచనాలతో బుధవారం మన మార్కెట్లు పెరిగాయి.
Stock Markets | Top Gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 18 స్టాక్స్ లాభాలతో, 12 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. ఎటర్నల్ 3.32 శాతం పెరగ్గా.. ఎయిర్‌టెల్ 1.82 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 1.79 శాతం, టెక్ మహీంద్రా 1.25 శాతం, రిలయన్స్ 1.23 శాతం పెరిగాయి.
Stock Markets | Top Losers..
బజాజ్ ఫైనాన్స్ 1.66 శాతం నష్టపోగా.. యాక్సిస్ బ్యాంక్ 0.90 శాతం, టీసీఎస్ 0.72 శాతం, టైటాన్ 0.60 శాతం, ఎల్‌అండ్‌టీ 0.58 శాతం పడిపోయాయి.