అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) లాభాల బాటలో పయనిస్తున్నాయి. బుధవారం ఉదయం 82 పాయింట్ల లాభంతో సెన్సెక్స్, 30 పాయింట్ల లాభంతో నిఫ్టీ(Nifty) ప్రారంభమయ్యాయి. తొలుత ఒడిదుడుకులను ఎదుర్కొని నష్టాలలోకి జారుకున్నాయి. కనిష్ట స్థాయిల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో తిరిగి కోలుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్(Sensex) గరిష్టంగా 319 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 99 పాయింట్ల లాభపడింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 264 పాయింట్ల లాభంతో 82,656 వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 25,187 వద్ద కొనసాగుతున్నాయి. చైనా, అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు పాజిటివ్‌గా సాగాయన్న ప్రకటనతో గ్లోబల్ మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి. భారత్, యూకేల మధ్య త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉండడం, భారత్, యూఎస్‌ల మధ్య ఈనెలలోనే మధ్యంతర వాణిజ్య ఒప్పందం(Trade deal) కుదిరే అవకాశాలు ఉండడంతో మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి.
Stock Market | జోరుమీదున్న ఆయిల్, ఎనర్జీ రంగాలు..
ఆయిల్ అండ్ గ్యాస్(Oil & Gas), ఎనర్జీ స్టాక్స్ పరుగులు తీస్తున్నాయి. బీఎస్‌ఈలో ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 1.94 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 1.76 శాతం లాభంతో కదలాడుతున్నాయి. టెలికాం సూచీ 0.70 శాతం, రియాలిటీ 0.55 శాతం లాభాలతో ఉన్నాయి. ఆటో, పీఎస్‌యూ, హెల్త్, మెటల్, ఇన్‌ఫ్రా స్టాక్స్‌లోనూ కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. కన్జూమర్ డ్యూరెబుల్ ఇండెక్స్ 0.33 శాతం పడిపోగా.. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.25 శాతం, ఎఫ్‌ఎంసీజీ సూచీ 0.21 శాతం నష్టంతో ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్(Small cap index) 0.59 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.29 శాతం, మిడ్ క్యాప్ 0.24 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి.
Stock Market | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 20 స్టాక్స్ లాభాలతో, 10 స్టాక్స్ నష్టాలతో కొనసాగుతున్నాయి. రిలయన్స్(Reliance) 1.68 శాతం పెరగ్గా.. ఎంఅండ్‌ఎం(M&M) 1.25 శాతం, టెక్ మహీంద్రా 0.94 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.78 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.87 శాతం లాభాలతో కదలాడుతున్నాయి.
Stock Market | Top losers..
పవర్‌గ్రిడ్(Power grid) 0.81 శాతం, ఎంఅండ్‌ఎం 0.53 శాతం, టైటాన్ 0.42 శాతం, మారుతి 0.26 శాతం, మారుతి 0.55 శాతం, హెచ్‌యూఎల్ 0.27 శాతం నష్టాలతో కొనసాగుతున్నాయి.