అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) గురువారం లాభాల బాటలో పయనిస్తున్నాయి. ఉదయం 198 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ మొదట్లో ఒడిదుడుకులకు లోనై స్వల్ప నష్టాల్లోకి జారుకుంది. ఆ తర్వాత కోలుకుని ఇంట్రాడేలో గరిష్టంగా 463 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ (Nifty) 71 పాయింట్ల లాభంతో ప్రారంభమై వెంటనే 78 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి కోలుకుని 148 పాయింట్లు పెరిగింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 410 పాయింట్ల లాభంతో 81,408 వద్ద, నిఫ్టీ 124 పాయింట్ల లాభంతో 24,743 వద్ద కొనసాగుతున్నాయి. రిలయన్స్(Reliance), ఎటర్నల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి స్టాక్స్ ప్రధాన సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి.
Stock Market | పీఎస్‌యూ బ్యాంక్స్, ఆటో స్టాక్స్ మినహా..
పీఎస్‌యూ బ్యాంక్స్(PSU Banks), ఆటో స్టాక్స్ మినహా మిగతా అన్ని రంగాల షేర్లు రాణిస్తున్నాయి. బీఎస్‌ఈ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.34 శాతం నష్టపోగా.. ఆటో ఇండెక్స్ 0.2 శాతం పడిపోయింది. రియాలిటీ షేర్లలో జోష్ కొనసాగుతోంది. రియాలిటీ ఇండెక్స్ 1.64 శాతం పెరిగింది. హెల్త్‌కేర్ సూచీ ఒక శాతం లాభంతో ఉంది. పవర్ ఇండెక్స్ 0.68 శాతం, ఇన్‌ఫ్రా 0.61 శాతం, ఎనర్జీ 0.63 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.57 శాతం, టెలికాం 0.55 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.44 శాతం లాభంతో కొనసాగుతున్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.82 శాతం, మిడ్ క్యాప్ 0.56 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.47 శాతం లాభాలతో ఉన్నాయి.
ఆర్‌బీఐ(RBI) ఎంపీసీ మీటింగ్ కొనసాగుతోంది. సమావేశం ఫలితాలు బయటికి రాకముందే రేట్ కట్(Rate cut)పై అంచనాలు ఇన్వెస్టర్లలో ఆశలు పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్లు సైతం పాజిటివ్‌గా కొనసాగుతుండడంతో మన మార్కెట్లు కూడా ర్యాలీ తీస్తున్నాయి. డాలర్ బలహీన పడడం అభివృద్ధి చెందుతున్న దేశాలకు సానుకూలాంశం. గురువారం వొలటాలిటీ ఇండెక్స్ మూడున్నర శాతం వరకు తగ్గింది. ఇది మన ఇన్వెస్టర్లలో భయాలు తగ్గి, విశ్వాసం పెరగడాన్ని సూచిస్తోంది.
Stock Market | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 17 స్టాక్స్ లాభాలతో, 13 స్టాక్స్ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఎటర్నల్(Eternal) అత్యధికంగా 5.58 శాతం పెరగ్గా.. పవర్‌గ్రిడ్ 1.85 శాతం, రిలయన్స్ 1.38 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.02 శాతం పెరిగాయి.
Stock Market | Top losers..
ఇండస్ ఇండ్ బ్యాంక్(Indusind bank) 1.11 శాతం పడిపోయింది. బజాజ్ ఫైనాన్స్ 0.97 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.86 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.55 శాతం, మారుతి 0.55 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.