Homeబిజినెస్​stock markets | బుల్‌ జోరు.. భారీ లాభాల్లో సూచీలు.. ఆల్‌టైం హైకి చేరువలో నిఫ్టీ,...

stock markets | బుల్‌ జోరు.. భారీ లాభాల్లో సూచీలు.. ఆల్‌టైం హైకి చేరువలో నిఫ్టీ, సెన్సెక్స్‌

stock markets | బుల్‌ జోరుతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు( దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్‌, నిఫ్టీలు ఆల్‌టైం హై స్థాయికి చేరువయ్యాయి.

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: stock markets | బుల్‌ జోరుతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్‌, నిఫ్టీలు ఆల్‌టైం హై స్థాయిలకు చేరువయ్యాయి.

గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నప్పటికీ దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మాత్రం పాజిటివ్‌గా సాగుతోంది. యూఎస్‌, భారత్‌(Bharat) మధ్య వాణిజ్య ఒప్పందం విషయంలో అడుగులు ముందుకు పడుతుండడం, రూపాయి విలువ బలపడుతుండడంతో మన మార్కెట్లు లాభాల బాటలో ఉన్నాయి.

ప్రధానంగా బ్యాంకింగ్‌ స్టాక్స్‌ మద్దతుతో ప్రధాన సూచీలు దూసుకుపోతూ ఆల్‌టైం హై స్థాయికి చేరువయ్యాయి. గురువారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 189 పాయింట్లు, నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. కొంత ఒడిదుడుకులకు లోనయినా పైపైకి వెళ్తున్నాయి.

ఇంట్రాడే(Intraday)లో సెన్సెక్స్‌ 82,791 నుంచి 83,127 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,376 నుంచి 25,472 పాయింట్ల మధ్యలో కదలాడుతున్నాయి. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 445 పాయింట్ల లాభంతో 83,050 వద్ద, నిఫ్టీ(Nifty) 128 పాయింట్ల లాభంతో 25,451 వద్ద ఉన్నాయి.

stock markets | ఆటో, బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో జోరు..

క్యాపిటల్‌ మార్కెట్‌(Capital market) మినహా దాదాపు మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణిస్తున్నాయి. బీఎస్‌ఈలో రియాలిటీ ఇండెక్స్‌ 1.63 శాతం పెరగ్గా.. ఆటో(Auto) 1.07 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్స్‌ ఇండెక్స్‌ 0.92 శాతం, బ్యాంకెక్స్‌ 0.68 శాతం, సర్వీసెస్‌ 0.67 శాతం, ఇన్‌ఫ్రా 0.59 శాతం, టెలికాం 0.56 శాతం, కమోడిటీ 0.56 శాతం లాభాలతో ఉన్నాయి. క్యాపిటల్‌ మార్కెట్‌ ఇండెక్స్‌ 0.41 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.21 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. స్మాల్‌ క్యాప్‌(Small cap) ఇండెక్స్‌ 0.49 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.48 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.32 శాతం లాభంతో ఉన్నాయి.

Top gainers..

బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 24 కంపెనీలు లాభాలతో ఉండగా.. 6 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. టైటాన్‌ 2.75 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.36 శాతం, అదానిపోర్ట్స్‌ 2.06 శాతం, టాటామోటార్స్‌ 2.03 శాతం, ఎంఅండ్‌ఎం 1.66 శాతం లాభాలతో ఉన్నాయి.

Top losers..

టీసీఎస్‌ 0.41 శాతం, హెచ్‌యూఎల్‌ 0.32 శాతం, ఇన్ఫోసిస్‌ 0.25 శాతం, ఎస్‌బీఐ 0.14 శాతం, సన్‌ఫార్మా 0.10 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.