Homeబిజినెస్​Stock Market | ఒడిదుడుకుల్లో స్టాక్‌ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రధాన సూచీలు

Stock Market | ఒడిదుడుకుల్లో స్టాక్‌ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రధాన సూచీలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా ఉండడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సైతం లాభాలతో సాగుతున్నాయి. అయితే సూచీలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్‌ 257 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా కొద్దిసేపటికి 162 పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత పుంజుకుని 233 పాయింట్లు పెరిగింది. 99 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ(Nifty) ఆ తర్వాత 51 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి కోలుకుని 79 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌(Sensex) 198 పాయింట్ల లాభంతో 80,434 వద్ద, నిఫ్టీ 90 పాయింట్ల లాభంతో 24,577 వద్ద కొనసాగుతున్నాయి.

ఎఫ్‌ఎంసీజీ మినహా..

బీఎస్‌ఈ(BSE)లో ఎఫ్‌ఎంసీజీ, ఐటీ మినహా మిగిలిన రంగాల స్టాక్స్‌ లాభాల బాటలో పయనిస్తున్నాయి. మెటల్‌ ఇండెక్స్‌(Metal index) 1.70 శాతం, ఆటో, హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌లు 1.23 శాతం, క్యాపిటల్‌ మార్కెట్‌ 1.15 శాతం, కమోడిటీ ఇండెక్స్‌ 0.71 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 0.70 శాతం, పీఎస్‌యూ 0.56 శాతం లాభాలతో ఉన్నాయి. ఎఫ్‌ఎంసీజీ(FMCG) ఇండెక్స్‌ 0.22 శాతం, ఐటీ ఇండెక్స్‌ 0.12 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.58 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.55 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.43 శాతం లాభంతో ఉన్నాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 16 కంపెనీలు లాభాలతో ఉండగా.. 14 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి.
ఎటర్నల్‌ 1.96 శాతం, టాటా మోటార్స్‌ 1.74 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 1.33 శాతం, ట్రెంట్‌ 1.30 శాతం, బీఈఎల్‌ 1.21 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : అదాని పోర్ట్స్‌ 0.74 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.55 శాతం, ఐటీసీ 0.48 శాతం, హెచ్‌యూఎల్‌ 0.24 శాతం, టైటాన్‌ 0.24 శాతం నష్టాలతో ఉన్నాయి.

Must Read
Related News