అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic Stock Markets) ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 96 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో ఇంట్రాడే(Intraday)లో 489 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో 599 పాయింట్లు పడిపోయింది. 22 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ(Nifty).. అక్కడినుంచి 139 పాయింట్లు పెరిగింది. 172 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 90 పాయింట్ల నష్టంతో 80,513 వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల నష్టంతో 24,561 వద్ద కొనసాగుతున్నాయి.
మిక్స్‌డ్‌గా సూచీలు..
సూచీలు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. బీఎస్‌ఈ(BSE)లో ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్(Oil and Gas) ఇండెక్స్‌లు 0.87 శాతం, ఐటీ ఇండెక్స్ 0.78 శాతం, ఎనర్జీ 0.65 శాతం, యుటిలిటీ 0.46 శాతం, మెటల్ ఇండెక్స్ 0.45 శాతం మేర లాభాలతో ఉన్నాయి. క్యాపిటల్ గూడ్స్ 0.82 శాతం, రియాలిటీ 0.76 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.53 శాతం, బ్యాంకెక్స్ 0.46 శాతం, టెలికాం(Telecom) 0.24 శాతం నష్టాలతో ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.12 శాతం లాభంతో ఉండగా.. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు 0.08 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 17 కంపెనీలు లాభాలతో ఉండగా.. 13 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. మారుతి 2.68 శాతం, టెక్ మహీంద్రా 1.70 శాతం, ఎంఅండ్‌ఎం 1.60 శాతం, టాటా స్టీల్ 1.13 శాతం, ఎన్టీపీసీ 0.92 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : బజాజ్ ఫైనాన్స్ 1.76 శాతం, ఎటర్నల్ 1.13 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.94 శాతం, ట్రెంట్ 0.83 శాతం, బీఈఎల్ 0.81 శాతం నష్టాలతో ఉన్నాయి.
