Homeబిజినెస్​Stock Market | ఒడిదుడుకుల్లో స్టాక్‌ మార్కెట్లు

Stock Market | ఒడిదుడుకుల్లో స్టాక్‌ మార్కెట్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Stock Market | ఇజ్రాయిల్‌, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు, అమెరికా ఫెడ్‌(Fed) నెగెటివ్‌ కామెంట్లతో గ్లోబల్‌ మార్కెట్లు ప్రతికూలంగా స్పందిస్తున్నాయి. అయినా మన మార్కెట్లు మాత్రం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. గురువారం ఉదయం సెన్సెక్స్‌ 41 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమై ఇంట్రాడే(Intraday)లో గరిష్టంగా 253 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి కోలుకుని 392 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ(Nifty) 9 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమై గరిష్టంగా 74 పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత కోలుకుని 125 లాభపడింది. ఉదయం 11.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌(Sensex) 54 పాయింట్ల నష్టంతో 81,391 వద్ద, నిఫ్టీ 8 పాయింట్ల నష్టంతో 24,03 వద్ద కొనసాగుతున్నాయి.

Stock Market | పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఐటీ స్టాక్స్‌లో సెల్లాఫ్‌

పీఎస్‌యూ బ్యాంక్(పీఎస్యూ Bank, ఐటీ రంగాల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. బీఎస్‌ఈ పీఎస్‌యూ బ్యాంక్స్‌ ఇండెక్స్‌ 1.64 శాతం పతనమవ్వగా.. ఐటీ సూచీ(IT index) 1.43 శాతం పడిపోయింది. మెటల్‌, పీఎస్‌యూ ఇండెక్స్‌లు 0.79 శాతం తగ్గగా.. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 0.72 శాతం, ఇన్‌ఫ్రా 0.61 శాతం, హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌ 0.55 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. ఎఫ్‌ఎంసీజీ, ఆటో, క్యాపిటల్‌ గూడ్స్‌ సెక్టార్ల స్టాక్స్‌ స్వల్ప లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. మిడ్‌ క్యాప్‌(Mid cap) ఇండెక్స్‌ 0.72 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.61 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.07 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.

Stock Market | Top gainers..

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 14 స్టాక్స్‌ మాత్రమే లాభాలతో ఉండగా 16 స్టాక్స్‌ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఎటర్నల్‌ (Eternal) 1.41 శాతం, ఎంఅండ్‌ఎం 0.78 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 0.78 శాతం, టైటాన్‌ 0.62 శాతం, ఐటీసీ 0.49 శాతం లాభాలతో ఉన్నాయి.

Stock Market | Top losers..

టెక్‌ మహీంద్రా(Tech Mahindra) 2.82 శాతం, అదానిపోర్ట్స్‌ 1.73 శాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1.14 శాతం, ఇన్ఫోసిస్‌ 1.09 శాతం, టీసీఎస్‌ 0.99 శాతం నష్టంతో కొనసాగుతున్నాయి.

Must Read
Related News