More
    Homeబిజినెస్​Stock Market | ఒడిదుడుకుల్లో స్టాక్‌ మార్కెట్లు

    Stock Market | ఒడిదుడుకుల్లో స్టాక్‌ మార్కెట్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market | ఇజ్రాయెల్‌, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో స్టాక్‌ మార్కెట్లు (Stock markets) నెగెటివ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. బుధవారం ఉదయం 269 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ (Sensex).. కోలుకుని లాభాల బాటపట్టింది. ఇంట్రాడేలో గరిష్టంగా 554 పాయింట్లు పెరిగింది. 65 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ.. అక్కడినుంచి 171 పాయింట్లు లాభపడిరది. అయితే మిడిల్‌ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల కోత విషయంలో యూఎస్‌ ఫెడ్‌ (US Fed) ఛైర్మన్‌ ఏ విధంగా స్పందిస్తారోనన్న ఆందోళనతో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతూ తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 216 పాయింట్ల నష్టంతో 81.367 వద్ద, నిఫ్టీ (Nifty) 47 పాయింట్ల నష్టంతో 24,806 వద్ద కొనసాగుతున్నాయి.

    Stock Market | ఆటో షేర్లలో కొనుగోళ్ల మద్దతు

    ఆటో షేర్లలో (Auto Shares) కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. దీంతో బీఎస్‌ఈ (BSE)లో ఆటో ఇండెక్స్‌ 0.68 శాతం పెరిగింది. టెలికాం సూచీ 0.12 శాతం లాభంతో ఉంది. ఐటీ ఇండెక్స్‌ 0.66 శాతం నష్టంతో ఉండగా.. ఇన్‌ఫ్రా, మెటల్‌ సూచీలు 0.55 శాతం, పవర్‌ 0.54 శాతం, పీఎస్‌యూ 0.41 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.37 శాతం నష్టంతో ఉన్నాయి. మిడ్‌ క్యాప్‌ 0.24 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.19 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.14 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.

    Stock Market | Top gainers..

    బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex)30 ఇండెక్స్‌లో 6 స్టాక్స్‌ మాత్రమే లాభాలతో ఉండగా 24 స్టాక్స్‌ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ (Indus ind bank) 3.40 శాతం, మారుతి 1.18 శాతం, ఎంఅండ్‌ఎం 0.87 శాతం, ఎటర్నల్‌ 0.59 శాతం, ఎయిర్‌టెల్‌ 0.32 శాతం లాభాలతో ఉన్నాయి.

    Stock Market | Top losers..

    హెచ్‌యూఎల్‌ (HUL) 1.34 శాతం, అదానీ పోర్ట్స్‌ 1.30 శాతం, నెస్లే 1.25 శాతం, కొటక్‌ బ్యాంక్‌ (Kotak Bank) 1.16 శాతం, టీసీఎస్‌ 0.97 శాతం నష్టంతో ఉన్నాయి.

    More like this

    KTR defamation case | KTR పరువు నష్టం కేసుపై బండి సంజయ్ రియాక్షన్.. ఆయన సంగతేమిటో త్వరలో బయటపెడతా!

    అక్షరటుడే, హైదరాబాద్: KTR defamation case కేంద్ర మంత్రి బండి సంజయ్​పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ BRS...

    Medha School | పగలంతా తరగతులు.. రాత్రి మత్తు మందు తయారీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medha School | హైదరాబాద్​ (Hyderabad)లోని బోయిన్​పల్లి మేధా పాఠశాలలో మత్తు మందు తయారు...

    KTR meets medical students | మెడికల్ విద్యార్థులతో కేటీఆర్ భేటీ.. కొత్త స్ధానికత జీవోపై చర్చ.. జరుగుతున్న నష్టంపై ఆవేదన

    అక్షరటుడే, హైదరాబాద్: KTR meets medical students | తెలంగాణలో కొత్త స్ధానికత జీవో కారణంగా నష్టపోతున్న మెడికల్...