అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి.
యూఎస్ టారిఫ్(US Tariffs)ల విషయంలో అనిశ్చితితో పాటు భారత్ Q4 జీడీపీ డాటా వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం ఉదయం 168 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్(Sensex).. ఆ తర్వాత కోలుకుని స్వల్ప లాభాల్లోకి వెళ్లింది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు తిరిగి లాభాల స్వీకరణకు దిగడంతో సూచీ మళ్లీ పతనమైంది. ఇంట్రాడేలో గరిష్టంగా 347 పాయింట్లు పడిపోయింది. గత ట్రేడింగ్ సెషన్‌తో పోల్చితే 21 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ(Nifty).. ఇంట్రాడేలో గరిష్టంగా 30 పాయింట్లు లాభపడింది. అక్కడినుంచి 146 పాయింట్లు నష్టపోయింది. మధ్యాహ్నం 12.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 302 పాయింట్ల నష్టంతో 81,330 వద్ద, నిఫ్టీ 98 పాయింట్ల నష్టంతో 24,735 వద్ద కొనసాగుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump Tarriff) విధించిన రెసిప్రోకల్ టారిఫ్‌ల విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. టారిఫ్‌లను నిలిపివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ఫెడరల్ అప్పీల్ కోర్టు నిలిపివేసింది. దీంతో గ్లోబల్ మార్కెట్లలో సెంటిమెంట్ బలహీనంగా మారింది. ఈరోజు మన దేశ జీడీపీ డాటా వెలువడనుంది. ఈ నేపథ్యంలో మన ఇన్వెస్టర్లు సైతం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు స్వల్ప ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. బీఎస్‌ఈ(BSE)లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రమే పాజిటివ్‌గా ఉంది. క్యాపిటల్ గూడ్స్, పీఎస్‌యూ బ్యాంక్స్ ఇండెక్స్‌లు లాభాలతో సాగుతున్నాయి. మెటల్, ఆటో, టెలికాం, ఎనర్జీ తదితర రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
Stock Market | Top losers..
బీఎస్‌ఈ సెన్సెక్స్ -30 ఇండెక్స్‌లో 6 కంపెనీలు మాత్రమే లాభాలతో సాగుతుండగా.. 24 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. ఎన్టీపీసీ(NTPC) 1.46 శాతం, టాటా మోటార్స్ 1.37 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 1.27 శాతం, ఇన్ఫోసిస్ 1.26 శాతం, ఆసియా పెయింట్స్ 1.15 శాతం నష్టాలతో ఉన్నాయి.
Stock Market | Gainers..
ఎటర్నల్(Eternal) 3.35 శాతం లాభపడగా.. ఎల్‌అండ్‌టీ 0.46 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.37 శాతం లాభాలతో ఉన్నాయి.