అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) గురువారం లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. ఉదయం 24 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్(Sensex).. అమ్మకాల ఒత్తిడితో 677 పాయింట్లు పడిపోయింది. వెంటనే తిరిగి కోలుకుని కనిష్టాలనుంచి తొమ్మిది వందలకుపైగా పాయింట్లు పెరిగింది. 28 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ(Nifty).. ప్రారంభంలోనే రెండువందలకుపైగా పాయింట్లు క్షీణించినా.. కొనుగోళ్ల మద్దతుతో కోలుకుని 275 పాయింట్లకుపైగా పెరిగింది. నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ(Weekly expiry) రోజు కావడంతో ఒలటాలిటీ ఎక్కువగా ఉంది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 166 పాయింట్ల నష్టంతో 81,163 వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 24,644 వద్ద కొనసాగుతున్నాయి. బీఎస్‌ఈలో 2428 కంపెనీలు లాభాలతో ఉండగా.. 1,276 కంపెనీలు నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి. 172 కంపెనీలు ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
Stock Market | మెటల్ స్టాక్స్‌లో కొనసాగుతున్న ర్యాలీ
మెటల్(Metal), రియాలిటీ సెక్టార్లలో ర్యాలీ కొనసాగుతోంది. స్మాల్ క్యాప్ స్టాక్స్ మెరుగైన రాబడిని ఇస్తున్నాయి. ఐటీ(IT), బ్యాంకింగ్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గురువారం బీఎస్‌ఈ స్మాల్ క్యాప్(Small cap) ఇండెక్స్ 0.79 శాతం, మిడ్ క్యాప్ 0.25 శాతం పెరగ్గా.. లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ఉంది. మెటల్ ఇండెక్స్ 0.9 శాతం పెరగ్గా.. ఆటో ఇండెక్స్ 0.65 శాతం, రియాలిటీ 0.5 శాతానికిపైగా లాభంతో కొనసాగుతున్నాయి. ఇన్‌ఫ్రా ఇండెక్స్ 0.35 శాతం, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ సూచీలు 0.2 శాతానికిపైగా లాభంతో ఉన్నాయి. ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ(PSU), హెల్త్‌కేర్, టెలికాం ఇండెక్స్‌లు స్లైట్ పాజిటివ్‌గా కదలాడుతున్నాయి. ఐటీ ఇండెక్స్ 0.55 శాతం నష్టంతో ఉండగా.. పవర్ 0.50 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.39 శాతం, బ్యాంకెక్స్(Bankex) 0.25 శాతం నష్టంతో కొనసాగుతున్నాయి.
Stock Market | Top Gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 9 కంపెనీలు లాభాలతో సాగుతుండగా.. 21 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. టాటా మోటార్స్(Tata motors) 2.3 శాతం లాభపడగా.. అదాని పోర్ట్స్(Adani ports) 1.13 శాతం లాభంతో ఉంది. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి.
Stock Market | Top Losers..
ఎన్టీపీసీ(NTPC) 1.45 శాతం నష్టపోగా.. పవర్‌గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కొటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్ ఒక శాతానికిపైగా నష్టాలతో కదలాడుతున్నాయి.