Homeబిజినెస్​Stock Market | స్వల్ప నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 25 వేల మార్క్‌ను దాటిన నిఫ్టీ

Stock Market | స్వల్ప నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 25 వేల మార్క్‌ను దాటిన నిఫ్టీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) గురువారం లాభాలతో ప్రారంభమైనా నిలదొక్కుకోలేకపోయాయి. అంతర్జాతీయంగా సానుకూల అంశాలున్నా.. మన సూచీలు నేల చూపులు చూస్తున్నాయి.

మంత్లీ ఎక్స్‌పైరీ కావడంతో ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. ఉదయం 279 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌(Trading) ప్రారంభించిన సెన్సెక్స్‌.. ఇంట్రాడేలో గరిష్టంగా 504 పాయింట్లు పెరిగింది. గత ట్రేడింగ్‌ సెషన్‌తో పోల్చితే 73 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ.. ఇంట్రాడే(Intraday)లో గరిష్టంగా 137 పాయింట్లు లాభపడింది. ఆ తర్వాత గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి.

మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌(Sensex) 18 పాయింట్ల నష్టంతో 81,296 వద్ద, నిఫ్టీ(Nifty) 16 పాయింట్ల నష్టంతో 24,736 వద్ద కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Trump) విధించిన లిబరేషన్‌ డే టారిఫ్‌లను యూఎస్‌ ఫెడరల్‌ కోర్టు నిరోధించడంతో గ్లోబల్‌ మార్కెట్లు ర్యాలీ తీశాయి. యూఎస్‌ ఫ్యూచర్స్‌(US Futures)తోపాటు ఆసియా మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. మన మార్కెట్లు సైతం లాభాలతో ప్రారంభమైనా.. ఇన్వెస్టర్లు గరిష్టాల వద్ద లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతుండడంతో నిలదొక్కుకోలేకపోతున్నాయి. వచ్చేవారంలో ఎంపీసీ మీటింగ్‌ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

Stock Market | రాణిస్తున్న ఐటీ, మెటల్‌ స్టాక్స్‌..

లార్జ్‌ క్యాప్‌(Large cap) స్టాక్స్‌ కన్నా స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఎక్కువగా రాణిస్తున్నాయి. ఐటీ, మెటల్‌ స్టాక్స్‌ లాభాలతో ఉండగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌ సూచీలను కిందికి లాగుతున్నాయి. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌(IT index) 0.7 శాతం పెరగ్గా.. మెటల్‌ ఇండెక్స్‌ 0.61 శాతం లాభాలతో ఉంది. రియాలిటీ ఇండెక్స్‌ 0.4 శాతం, హెల్త్‌ కేర్‌ ఇండెక్స్‌ 0.32 శాతం లాభాలతో కొనసాగుతోంది. పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.58 పడిపోగా.. బ్యాంకెక్స్‌ 0.3 శాతం, ఎఫ్‌ఎంసీజీ సూచీ 0.23 శాతం నష్టాలతో ఉన్నాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.31 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.26 శాతం పెరగ్గా.. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ మాత్రం స్వల్ప నష్టాలతో ట్రేడ్‌ అవుతోంది.

Stock Market | Top gainers..

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 20 కంపెనీలు లాభాలతో సాగుతుండగా.. 10 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి.
ఎటర్నల్‌(Eternal) 1.52 శాతం, సన్‌ ఫార్మా 1.45 శాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1.40 శాతం, టాటా స్టీల్‌ 0.93 శాతం లాభంతో కదలాడుతున్నాయి.

Stock Market | Top losers..

బజాజ్‌ ఫైనాన్స్‌(Bajaj finance) 0.91 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.69 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 0.63 శాతం, ఐటీసీ 0.62 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 0.58 శాతం, icici bank 0.48 శాతం నష్టంతో కొనసొగుతున్నాయి.