ePaper
More
    Homeబిజినెస్​Stock Market | స్వల్ప నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

    Stock Market | స్వల్ప నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Domestic Stock Markets) స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి. దేశీయంగా ఎలాంటి ప్రతికూలతలు లేకపోయినా.. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితులకుతోడు రష్యా వాణిజ్య భాగస్వాములపై భారీ సుంకాలు (Heavy Tariffs) విధిస్తామన్న నాటో బెదిరింపులతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతింది. బుధవారం ఉదయం నిఫ్టీ ఫ్లాట్‌గా ప్రారంభమవగా.. సెన్సెక్స్‌(Sensex) 36 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమెంది. ఒడిదుడుకులకు లోనవుతూ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌, నిఫ్టీ(Nifty) స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి.

    Stock Market | అన్ని రంగాల్లో మిశ్రమ స్పందన..

    అన్ని రంగాలు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. బీఎస్‌ఈ(BSE)లో పీఎస్‌యూ బ్యాంక్‌ 0.36 శాతం, ఎఫ్‌ఎంసీజీ(FMCG) 0.19 శాతం, ఐటీ ఇండెక్స్‌ 0.17 శాతం, టెలికాం 0.16 శాతం లాభంతో కొనసాగుతున్నాయి. మెటల్‌(Metal) ఇండెక్స్‌ 0.73 శాతం, ఆటో ఇండెక్స్‌ 0.69 శాతం, కమోడిటీ 0.54 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్‌ 0.31 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 0.28 శాతం నష్టాలతో ఉన్నాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.07 శాతం లాభంతో ఉండగా.. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.22 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.05 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.

    READ ALSO  Stock Market | ఐటీ స్టాక్స్‌లో భారీ పతనం.. నష్టాలతో ముగిసిన ప్రధాన సూచీలు

    Top Gainers:బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 13 కంపెనీలు లాభాలతో 17 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. టెక్‌మహీంద్రా 1.09 శాతం, అదాని పోర్ట్స్‌ 093 శాతం, ఇన్ఫోసిస్‌ 0.64 శాతం, ఆసియా పెయింట్స్‌ 0.45 శాతం, ఎస్‌బీఐ 0.40 శాతం లాభాలతో సాగుతున్నాయి.

    Top Losers:ఎటర్నల్‌ 1.86 శాతం, సన్‌ఫార్మా 1.16 శాతం, టాటా స్టీల్‌ 0.97 శాతం, ఎంఅండ్‌ఎం 0.91 శాతం,బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 0.84 శాతం నష్టాలతో ఉన్నాయి.

    Latest articles

    Nizamabad City | నగరంలో దొంగల బీభత్సం..ఆలస్యంగా వెలుగులోకి ఘటన..

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad City | నగరంలోని ఓ ఆపార్ట్​మెంట్​లో చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది....

    Fee reimbursement | ఫీజు రీయింబర్స్​మెంట్​ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

    అక్షరటుడే, కామారెడ్డి : Fee reimbursement | ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు...

    Metro Services | వైజాగ్,విజయవాడల‌లో మెట్రో సేవ‌లు.. ఎప్ప‌టి నుండి అందుబాటులోకి రానుంది అంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Metro Services | ఆంధ్రప్ర‌దేశ్‌లో పట్టణాల అభివృద్ధికి మరో అడుగు ముందుకు పడింది. విజయవాడ, విశాఖపట్నంల‌లో మెట్రో...

    KTR | కేటీఆర్​కు ఘనస్వాగతం

    అక్షరటుడే, కామారెడ్డి: KTR | లింగంపేటలో (Lingampet) తలపెట్టిన బీఆర్ఎస్ ఆత్మగౌరవ సభ (BRS Athma gourava Sabha)లో...

    More like this