Homeబిజినెస్​Stock Market | లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 25 వేల మార్క్‌కు చేరువలో నిఫ్టీ

Stock Market | లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 25 వేల మార్క్‌కు చేరువలో నిఫ్టీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) నష్టాలబాటలో సాగుతున్నా.. మన మార్కెట్లు మాత్రం లాభాల బాటలో సాగుతున్నాయి. జాబ్‌ డాటా పాజిటివ్‌గా రావడం, యూఎస్‌ సుంకాలు తగ్గించే అవకాశాలుండడం, రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్‌ సరఫరా విషయంలో చైనా సానుకూలంగా ఉండడం తదితర కారణాలతో మన మార్కెట్లు స్థిరంగా ముందుకు వెళ్తున్నాయి.

మంగళవారం ఉదయం సెన్సెక్స్‌ 42 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 15 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 81,315 నుంచి 81,520 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 24,873 నుంచి 24,943 పాయింట్ల మధ్యలో కదలాడుతున్నాయి. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌(Sensex) 283 పాయింట్ల లాభంతో 81,557 వద్ద, నిఫ్టీ 78 పాయింట్ల లాభంతో 24,955 వద్ద కొనసాగుతున్నాయి. మార్కెట్లను రిలయన్స్‌(Reliance) షేర్లు ముందుకు తీసుకువెళ్తున్నాయి. జియో ప్లాన్లలో మార్పులతో రిలయన్స్‌ షేర్లు రాణిస్తున్నాయి.

Stock Market | ఆటోలో కొనసాగుతున్న జోరు..

ప్రధాన సూచీలు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. ఆటో(Auto) స్టాక్స్‌లో జోరు కొనసాగుతోంది. బీఎస్‌ఈలో ఆటో ఇండెక్స్‌ 1.10 శాతం, ఎనర్జీ(Energy) 1.01 శాతం పెరిగాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీ 0.97 శాతం, టెలికాం 0.80 శాతం, మెటల్‌ 0.38 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.36 శాతం లాభంతో ఉన్నాయి. క్యాపిటల్‌ మార్కెట్‌ ఇండెక్స్‌ 0.32 శాతం నష్టంతో కదలాడుతోంది. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.65 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.43 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.24 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 15 కంపెనీలు లాభాలతో ఉండగా.. 15 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి.
టాటా మోటార్స్‌ 3.25 శాతం, అదాని పోర్ట్స్‌ 2.14 శాతం, రిలయన్స్‌ 2.09 శాతం, ఎయిర్‌టెల్‌ 1.38 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 0.93 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.07 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.04 శాతం, బీఈఎల్‌ 0.92 శాతం, ఆసియా పెయింట్‌ 0.79 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 0.76 శాతం నష్టాలతో కొనసాగుతున్నాయి.

Must Read
Related News