Homeబిజినెస్​Stock Market | లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

Stock Market | లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Domestic Stock Markets) లాభాల బాటలో పయనిస్తున్నాయి. ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్‌ స్టాక్స్‌ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణిస్తున్నాయి. దీంతో ప్రధాన సూచీలు స్థిరంగా పైకి సాగుతున్నాయి.

శుక్రవారం ఉదయం సెన్సెక్స్‌ 210 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 69 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. స్వల్ప ఒడిదుడుకులు ఉన్నా.. స్థిరంగా ముందుకు సాగుతున్నాయి. సెన్సెక్స్‌ 81,641 నుంచి 81,992 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,038 నుంచి 25,139 పాయింట్ల మధ్యలో ట్రేడ్‌ అవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ (Sensex) 384 పాయింట్ల లాభంతో 81,934 వద్ద, నిఫ్టీ 112 పాయింట్ల లాభంతో 25,117 వద్ద ఉన్నాయి.

Stock Market | ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌ మినహా..

ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌ ఇండెక్స్‌లు మాత్రమే నష్టాలతో ఉన్నాయి. బీఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్ (PSU bank) ఇండెక్స్‌ 0.51 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ 0.49 శాతం నష్టంతో ఉన్నాయి. క్యాపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ 1.05 శాతం పెరగ్గా.. టెలికాం 0.98 శాతం, సర్వీసెస్‌ 0.81 శాతం, ఆటో 0.72 శాతం, క్యాపిటల్‌ మార్కెట్‌ 0.58 శాతం, ఇన్‌ఫ్రా 0.48 శాతం, హెల్త్‌కేర్‌ 0.46 శాతం, ఐటీ ఇండెక్స్‌ 0.45 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్‌ 0.45 లాభాలతో ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.45 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.35 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.21 శాతం లాభాలతో సాగుతున్నాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 22 కంపెనీలు లాభాలతో ఉండగా.. 8 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. బీఈఎల్‌ 2.95 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.81 శాతం, మారుతి 1.47 శాతం, ఎల్‌టీ 1.47 శాతం, ఇన్ఫోసిస్‌ 1.24 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : హెచ్‌యూఎల్‌ 1.46 శాతం, ఎటర్నల్‌ 0.35 శాతం, ఎన్టీపీసీ 0.33 శాతం, ఎస్‌బీఐ 0.30 శాతం, టాటా స్టీల్‌ 0.30 శాతం నష్టంతో ఉన్నాయి.