అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock market) లాభాలతో కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం సెన్సెక్స్ 363 పాయింట్ల గ్యాప్‌అప్(Gap up)లో ప్రారంభమైంది.
ఆ తర్వాత 299 పాయింట్లు తగ్గినా మళ్లీ కోలుకుని 310 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ(Nifty) 92 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా వెంటనే 88 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని 91 పాయింట్లు పైకి ఎగబాకింది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 248 పాయింట్ల లాభంతో 82,105 వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 25,113 వద్ద కొనసాగుతున్నాయి.
Stock Market | మిక్స్‌డ్‌గా సూచీలు
సూచీలు మిశ్రమంగా సాగుతున్నాయి. బీఎస్‌ఈ(BSE)లో రియాలిటీ ఇండెక్స్ 1.17 శాతం పెరగ్గా.. హెల్త్‌కేర్(Health care) 0.70 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.55 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.54 శాతం, టెలికాం 0.50 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 0.44 శాతం పెరిగాయి. ఎఫ్‌ఎంసీజీ సూచీ 0.44 శాతం, పవర్ 0.40 శాతం, యుటిలిటీ 0.30 శాతం, ఇన్‌ఫ్రా 0.04 శాతం నష్టాలతో ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్(Small cap index) 0.55 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.36 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.25 శాతం లాభాలతో సాగుతున్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 21 కంపెనీలు లాభాలతో ఉండగా.. 9 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి.
ఎల్‌టీ 1.21 శాతం, రిలయన్స్ 1.02 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.02 శాతం, బీఈఎల్ 0.98 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.86 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : హెచ్‌యూఎల్ ఒక శాతం, ఎటర్నల్ 0.89 శాతం, పవర్‌గ్రిడ్ 0.88 శాతం, ఎన్టీపీసీ 0.80 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.27 శాతం నష్టంతో ఉన్నాయి.