అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Stock market | దేశీయ స్టాక్ మార్కెట్ల్లు(Domestic stock markets) లాభాల బాటపట్టాయి. బుధవారం ఉదయం 40 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్(Sensex).. మొదట్లో స్వల్ప ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఆ తర్వాత కోలుకుని ఇంట్రాడేలో గరిష్టంగా 230 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 18 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమై ఇంట్రాడే(Intraday)లో గరిష్టంగా 70 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 194 పాయింట్ల లాభంతో 80,932 వద్ద, నిఫ్టీ(Nifty) 53 పాయింట్ల లాభంతో 24,595 వద్ద కొనసాగుతున్నాయి.
ఆర్‌బీఐ(RBI) మానిటరీ పాలసీ కమిటీ మూడు రోజుల సమావేశం బుధవారం ప్రారంభమైంది. వడ్డీ రేట్లను కచ్చితంగా 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తారని మార్కెట్ నమ్ముతోంది. ఎంపీసీ(MPC) మీటింగ్ తీర్మానాల కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య చర్చలలో పురోగతి నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పాజిటివ్‌గా మారుతోంది. దీంతో గ్లోబల్ మార్కెట్లు పెరుగుతున్నాయి.
Stock market | మిక్స్‌డ్‌గా సెక్టార్లు..
దాదాపు అన్ని సెక్టార్ల స్టాక్స్ స్వల్ప లాభనష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. బీఎస్‌ఈ(BSE)లో ఐటీ ఇండెక్స్ 0.48 శాతం పెరగ్గా.. ఆటో ఇండెక్స్ 0.45 శాతం లాభంతో కొనసాగుతోంది. ఇన్‌ఫ్రా, ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్స్, హెల్త్‌కేర్, మెటల్ సూచీలు స్వల్ప లాభాలతో ఉన్నాయి. రియాలిటీ ఇండెక్స్ 0.82 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ 0.32 శాతం నష్టంతో ఉన్నాయి. బ్యాంకెక్స్, ఎనర్జీ, పీఎస్‌యూ ఇండెక్స్‌లు స్వల్ప నష్టాలతో కదలాడుతున్నాయి.
Stock market | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 20 కంపెనీలు లాభాలతో, 10 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. ఎయిర్‌టెల్(Airtel) 1.55 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 1.31 శాతం, టెక్ మహీంద్రా 1.20 శాతం, ఎటర్నల్ 1.09 శాతం లాభంతో కొనసాగుతున్నాయి.
Stock market | Top losers..
ఎన్టీపీసీ(NTPC) 0.88 శాతం నష్టపోగా.. సన్ ఫార్మా 0.87 శాతం, యాక్సిక్ బ్యాంక్ 0.76 శాతం, టైటాన్ 0.68 శాతం నష్టాలతో ఉన్నాయి.