Homeబిజినెస్​Stock Market | నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 0.8 శాతం పడిపోయిన సెన్సెక్స్‌

Stock Market | నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 0.8 శాతం పడిపోయిన సెన్సెక్స్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Stock market | వాల్‌స్ట్రీట్‌(Wall street)తోపాటు ఆసియా మార్కెట్ల ప్రభావం మన మార్కెట్లపైనా కనిపిస్తోంది. దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) గురువారం నష్టాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 273 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌(Sensex).. ఇంట్రాడేలో గరిష్టంగా 869 పాయింట్లు క్షీణించింది. గత ట్రేడింగ్‌ సెషన్‌తో పోల్చితే 80 పాయింట్ల దిగువన ప్రారంభమైన నిఫ్టీ(Nifty).. ఇంట్రాడేలో గరిష్టంగా 272 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 11.00 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 713 పాయింట్ల నష్టంతో 80,883 వద్ద, నిఫ్టీ 214 పాయింట్ల నష్టంతో 24,600 వద్ద కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా స్పందిస్తుండడం, కోవిడ్‌(Covid) వ్యాప్తి పెరుగుతుండడం, పలు దేశాల మధ్య జియో పొలిటికల్‌ టెన్షన్స్‌ నెలకొనడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Stock market | ఎఫ్‌ఎంసీజీ, ఆటో సెక్టార్లలో సెల్లాఫ్‌..

అన్ని సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ(FMCG), ఆటో సెక్టార్లలో సెల్లాఫ్‌ కనిపిస్తోంది. బీఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ, ఆటో(Auto), కన్జూమర్‌ డ్యూరెబెల్‌ ఇండెక్స్‌లు ఒక శాతానికిపైగా నష్టంతో కొనసాగుతున్నాయి. ఐటీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఎనర్జీ సూచీలు అర శాతానికిపైగా నష్టంతో ఉన్నాయి. బ్యాంకింగ్‌, పవర్‌, పీఎస్‌యూ, హెల్త్‌కేర్‌ రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. టెలికాం(Telecom), రియాలిటీ ఇండెక్స్‌లు మాత్రమే పాజిటివ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.27 శాతం లాభాలతో ఉండగా.. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ స్వల నష్టాలతో కొనసాగుతోంది. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.73 శాతం నష్టంతో ఉంది.

Gainers..

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 3 కంపెనీలు మాత్రమే లాభాలతో సాగుతుండగా.. 27 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. టాటా స్టీల్‌(Tata steel) 0.6 శాతం లాభంతో ఉండగా.. ఎయిర్‌టెల్‌ 0.5 శాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 0.38 శాతం లాభంతో కొనసాగుతున్నాయి.

Top losers..

పవర్‌ గ్రిడ్‌(Power grid) 2.2 శాతం నష్టపోయింది. ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐటీసీ, రిలయన్స్‌, టాటా మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతి, టెక్‌ మహీంద్రా(Tech Mahindra), హెచ్‌యూఎల్‌, నెస్లే, యాక్సిస్‌ బ్యాంక్‌, టైటాన్‌, టీసీఎస్ ఒక శాతానికిపైగా నష్టంతో కదలాడుతున్నాయి.

Must Read
Related News