Homeబిజినెస్​Stock Market | నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు..25 వేల దిగువకు నిఫ్టీ

Stock Market | నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు..25 వేల దిగువకు నిఫ్టీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) శుక్రవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 138 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్‌.. ఇంట్రాడే(Intraday)లో గరిష్టంగా 677 పాయింట్లు పడిపోయింది. ఫ్టాల్‌గా ప్రారంభమైన నిఫ్టీ.. ఇంట్రాడేలో 109 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11.55 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌(Sensex) 318 పాయింట్ల నష్టంతో 82,212 వద్ద, నిఫ్టీ(Nifty) 88 పాయింట్ల నష్టంతో 24,972 వద్ద కొనసాగుతున్నాయి.
గత ట్రేడింగ్‌ సెషన్‌లో భారీ లాభాలు రావడంతో శుక్రవారం ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. స్వల్ప ప్రాఫిట్‌ బుకింగ్‌(Profit booking)కు దిగడంతో ప్రధాన సూచీలు కొద్దిగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. హాంగ్‌కాంగ్‌లో కోవిడ్‌(Covid) కేసులు పెరుగుతుండడం, అంతర్జాతీయ మార్కెట్లు మిక్స్‌డ్‌గా స్పందిస్తుండడంతో మన మార్కెట్లలోనూ ఒత్తిడి కనిపిస్తోంది.

Stock Market | స్మాల్‌ క్యాప్‌లో కొనసాగుతున్న ర్యాలీ..

స్మాల్‌(Small), మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌లో ర్యాలీ కొనసాగుతోంది. శుక్రవారం బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.80 శాతం, మిడ్‌ క్యాప్‌ 0.63 శాతం పెరగ్గా.. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ ఫ్లాట్‌గా కొనసాగుతోంది. రియాలిటీ ఇండెక్స్‌(Realty index) 1.72 శాతం పెరగ్గా.. క్యాపిటల్‌ గూడ్స్‌ 1.5 శాతం, పీఎస్‌యూ 1.49 శాతం, ఇన్‌ఫ్రా ఇండెక్స్‌ 1.44, పవర్‌ ఇండెక్స్‌ 1.2 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి. పీఎస్‌యూ బ్యాంక్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఎఫ్‌ఎంసీజీ, ఎనర్జీ, ఆటో(Auto), కన్జూమర్‌ డ్యూరెబుల్‌ సూచీలలో కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది. ఐటీ ఇండెక్స్‌ 1.11 శాతం నష్టంతో ఉండగా.. మెటల్‌, బ్యాంకెక్స్‌(Bankex) 0.19 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.