Homeబిజినెస్​Stock Market | నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. మళ్లీ 25 వేల దిగువకు నిఫ్టీ

Stock Market | నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. మళ్లీ 25 వేల దిగువకు నిఫ్టీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) శుక్రవారం బలహీనంగా ప్రారంభమయ్యాయి. యూఎస్‌ సుంకాల గడువు సమీపిస్తుండడంతో ఇన్వెస్టర్లు గరిష్టాల వద్ద ప్రాఫిట్‌ బుకింగ్‌(Profit booking)కు ప్రాధాన్యత ఇస్తున్నారు.

దీంతో నిఫ్టీ మరోసారి 25 వేల మార్క్‌ దిగువకు పడిపోయింది. ఉదయం సెన్సెక్స్‌(Sensex) 49 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమై 42 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు దిగడంతో అక్కడినుంచి 500 పాయింట్లు పడిపోయింది. 19 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ 20 పాయింట్లు పెరిగినా నిలదొక్కుకోలేకపోయింది. గరిష్టాలనుంచి 201 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 531 పాయింట్ల నష్టంతో 81,468 వద్ద, నిఫ్టీ(Nifty) 163 పాయింట్ల నష్టంతో 24,920 వద్ద కొనసాగుతున్నాయి. లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఎక్కువగా నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఇండెక్స్‌లలో హెవీవెయిట్‌ స్టాక్స్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(HDFC Bank), ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ నష్టాలతో ఉన్నాయి.

Stock Market | ఒత్తిడిలో సూచీలు

ఎఫ్‌ఎంసీజీ(FMCG), మెటల్‌, బ్యాంకింగ్‌ రంగాల స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. బీఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ సూచీ 0.90 శాతం పడిపోగా మెటల్‌ 0.84 శాతం, బ్యాంకెక్స్‌ 0.7 శాతం, కమోడిటీ 0.69 శాతం, ఐటీ 0.56 శాతం, ఎనర్జీ 0.55 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌ 0.46 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. క్యాపిటల్‌ గూడ్స్‌(Capital goods) ఇండెక్స్‌ 0.42 శాతం, హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌ 0.05 శాతం లాభంతో ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.59 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.12 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.07 శాతం నష్టంతో సాగుతున్నాయి.

Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 5 కంపెనీలు లాభాలతో ఉండగా.. 25 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. బీఈఎల్‌ 0.84 శాతం, ఎంఅండ్‌ఎం 0.46 శాతం, సన్‌ఫార్మా 0.32 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 0.11 శాతం, ట్రెంట్‌ 0.02 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers :ఆసియా పెయింట్‌ 1.74 శాతం, ఐటీసీ 1.44 శాతం, అదాని పోర్ట్స్‌ 1.42 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.33 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.26 శాతం నష్టంతో ఉన్నాయి.

Must Read
Related News