అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | గ్లోబల్ మార్కెట్లు(global markets) పాజిటివ్‌గా ఉన్నా మన మార్కెట్లు మాత్రం నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. ఐటీ స్టాక్స్ ప్రధాన సూచీలను కిందికి లాగుతున్నాయి. గురువారం సెన్సెక్స్(Sensex) 53 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమె వెంటనే నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో గరిష్టంగా 482 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 24 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమైనా నిలదొక్కుకోలేక వెంటనే 141 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 420 పాయింట్ల నష్టంతో 82,305 వద్ద, నిఫ్టీ(Nifty) 116 పాయింట్ల నష్టంతో 25,103 వద్ద కొనసాగుతున్నాయి.
Stock Market | నష్టాల్లో ఐటీ, ఎనర్జీ, రియాలిటీలో సెల్లాఫ్.
ప్రధాన సూచీలను ఐటీ స్టాక్స్ వెనక్కి లాగుతున్నాయి. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్(IT index) 1.77 శాతం పడిపోగా.. రియాలిటీ 1.28 శాతం, ఎనర్జీ 0.81 శాతం, పవర్ 0.70 శాతం, యుటిలిటీ 0.67 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.61 శాతం, ఎఫ్‌ఎంసీజీ(FMCG) 0.60 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.54 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.54 శాతం, బ్యాంకెక్స్ 0.49 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. హెల్త్‌కేర్ ఇండెక్స్ 0.54 శాతం పెరగ్గా.. ఆటో సూచీ ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. మిడ్ క్యాప్(Mid cap) ఇండెక్స్ 0.55 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.41 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.29 శాతం నష్టంతో ఉన్నాయి.
Top Gainers:బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 6 కంపెనీలు లాభాలతో 24 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. ఎటర్నల్ 3.21 శాతం, టాటామోటార్స్ 1.77 శాతం, సన్‌ఫార్మా 0.45 శాతం, టాటా స్టీల్ 0.40 శాతం, టైటాన్ 0.19 శాతం లాభాలతో సాగుతున్నాయి.
Top Losers:ట్రెంట్ 3.15 శాతం, టెక్‌మహీంద్రా 2.30 శాతం, రిలయన్స్ 1.22 శాతం, ఇన్ఫోసిస్ 1.21 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.05 శాతం నష్టాలతో ఉన్నాయి.