Homeబిజినెస్​Stock Market | నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

Stock Market | నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి.

సోమవారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 31 పాయింట్ల స్వల్ప నష్టంతో ట్రేడింగ్‌ మొదలుపెట్టింది. అక్కడినుంచి కాస్త పుంజుకుని 72 పాయింట్లు పెరిగినా.. అంతర్జాతీయ పరిస్థితులకుతోడు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో Intraday గరిష్టాల వద్దనుంచి 405 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 8 పాయింట్లు మాత్రమే లాభపడింది. అక్కడినుంచి 133 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 270 పాయింట్ల నష్టంతో 83,788 వద్ద, నిఫ్టీ(Nifty) 76 పాయింట్ల నష్టంతో 25,561 వద్ద కొనసాగుతున్నాయి. పీఎస్‌యూ బ్యాంక్స్‌ అవుట్‌ పర్ఫార్మ్‌ చేస్తున్నాయి.

బీఎస్‌ఈ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఇంట్రాడేలో గరిష్టంగా 2 శాతానికిపైగా పెరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వివిధ దేశాలపై విధించిన టారిఫ్‌ పాజ్‌(tariff pause) గడువు జూలై 9తో ముగియనుంది. గడువు సమీపిస్తున్నా చాలా దేశాలు యూఎస్‌తో ఎలాంటి ట్రేడ్‌ అగ్రిమెంట్స్‌ చేసుకోలేదు. ఈ నేపథ్యంలో మరోసారి టారిఫ్‌లను పాజ్‌ను పొడిగించే అవకాశం లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు.

అలాగే జపాన్‌(Japan)నుంచి దిగుమతి చేసుకునే కార్లపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గాయనుకుంటున్న సమయంలో ఇరాన్‌కు చెందిన మతపెద్ద అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌(Trump), ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహులను శత్రువులుగా పేర్కొంటు ఫత్వా జారీ చేయడంతో జియో పొలిటికల్‌ టెన్షన్స్‌ తగ్గలేదన్న సంకేతాన్ని ఇస్తోంది. దీంతో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.

Stock Market | పీఎస్‌యూ బ్యాంక్‌ స్టాక్స్‌లో ర్యాలీ

పీఎస్‌యూ బ్యాంక్‌(PSU Bank), క్యాపిటల్‌ గూడ్స్‌ సెక్టార్ల స్టాక్స్‌ దూకుడును ప్రదర్శిస్తున్నాయి. బీఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2.33 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 0.86 శాతం పెరిగాయి. పీఎస్‌యూ ఇండెక్స్‌ 0.61 శాతం, ఇన్‌ఫ్రా ఇండెక్స్‌ 0.33 శాతం లాభాలతో సాగుతున్నాయి. రియాలిటీ ఇండెక్స్‌ 0.64 శాతం, మెటల్‌ 0.4 శాతం, టెలికాం ఇండెక్స్‌ 0.37 శాతం, బ్యాంకెక్స్‌ 0.43 శాతం నష్టాలతో ఉన్నాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.53 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.30 శాతం లాభాలతో ఉండగా.. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.21 శాతం నష్టంతో కదలాడుతోంది.

Top gainers:బీఎస్‌ఈలో 10 కంపెనీలు లాభాలతో 20 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. ఎన్‌బీఐ 1.53 శాతం, సన్‌ఫార్మా 0.71 శాతం, బీఈఎల్‌ 0.66 శాతం, ఎటర్నల్‌ 0.40 శాతం, టాటా మోటార్స్‌ 0.40 శాతం లాభాలతో ఉన్నాయి.

Top losers:కొటక్‌ బ్యాంక్‌ 1.27 శాతం, ఎయిర్‌టెల్‌ 1.08 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.95 శాతం, మారుతి 0.85 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.84 శాతం నష్టాలతో ఉన్నాయి.