Homeబిజినెస్​Stock Market | నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

Stock Market | నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

- Advertisement -


అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | ఇజ్రాయెల్‌(Israel), ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండడం, యూఎస్‌ ఫెడ్‌ మీటింగ్‌ల(Fed meeting) నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు(FII) మన మార్కెట్లనుంచి పెట్టుబడులు ఉపసంహరిస్తుండడంతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. మంగళవారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 73 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమై 21 పాయింట్లు మాత్రమే పెరిగింది. తర్వాత అమ్మకాల ఒత్తిడితో ఇంట్రాడే గరిష్టాల నుంచి 419 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 31 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమై మరో ఐదు పాయింట్లు మాత్రమే పెరిగి 136 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 145 పాయింట్ల లాభంతో 81,650 వద్ద, నిఫ్టీ(Nifty) 52 పాయింట్ల లాభంతో 24,894 వద్ద కొనసాగుతున్నాయి.

Stock Market | ఐటీలో కొనసాగుతున్న ర్యాలీ..

ఐటీ సెక్టార్‌(IT sector)లో ర్యాలీ కొనసాగుతోంది. బీఎస్‌ఈలో అత్యధికంగా ఐటీ ఇండెక్స్‌ 0.78 శాతం పెరిగింది. రియాలిటీ(Realty) సూచీ 0.58 శాతం పెరగ్గా.. టెలికాం, పీఎస్‌యూ, క్యాపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌లు స్వల్ప లాభాలతో ఉన్నాయి. హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌ 0.89 శాతం తగ్గింది. పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌, బ్యాంకెక్స్‌, ఇన్‌ఫ్రా, మెటల్‌, ఎనర్జీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఆటో ఇండెక్స్‌లు స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.21 శాతం నష్టంతో ఉండగా.. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.10 శాతం, మిడ్‌ క్యాప్‌ 0.09 శాతం లాభాలతో కదలాడుతున్నాయి.

Stock Market | Top gainers..

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 12 స్టాక్స్‌ లాభాలతో ఉండగా 18 స్టాక్స్‌ నష్టాలతో కొనసాగుతున్నాయి.
ఇన్ఫోసిస్‌(Infosys) 1.23 శాతం, ఆసియా పెయింట్‌ 1.22 శాతం, టెక్‌ మహీంద్రా 0.94 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 0.67 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.47 శాతం లాభాలతో కదలాడుతున్నాయి.

Stock Market | Top losers..

సన్‌ఫార్మా(Sun pharma) 1.94 శాతం, ఎటర్నల్‌ 1.45 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.43 శాతం, టైటాన్‌ 0.93 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.88 శాతం నష్టంతో ఉన్నాయి.

Must Read
Related News