అక్షరటుడే, వెబ్‌డెస్క్:Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) నష్టాలతో వారాన్ని ప్రారంభించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో మన సూచీలూ నేల చూపులు చూస్తున్నాయి. సోమవారం ఉదయం 237 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్(Sensex).. ఇంట్రాడేలో గరిష్టంగా 797 పాయింట్లు పడిపోయింది. 81 పాయింట్ల నష్టంతో ట్రేడిరగ్ ప్రారంభించిన నిఫ్టీ.. ఇంట్రాడేలో గరిష్టంగా 224 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 480 పాయింట్ల నష్టంతో 80,970 వద్ద, నిఫ్టీ (Nifty) 138 పాయింట్ల నష్టంతో 24,612 వద్ద కొనసాగుతున్నాయి.
Stock Market | పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్‌లో ర్యాలీ..
లార్జ్ క్యాప్(Large cap) స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురవుతుండగా.. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్ రాణిస్తున్నాయి. బీఎస్‌ఈలో స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.35 శాతం పెరిగింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.23 శాతం లాభంతో కొనసాగుతోంది. లార్జ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 0.44 శాతం నష్టంతో ఉంది. పీఎస్‌యూ బ్యాంక్(PSU Bank), రియాలిటీ స్టాక్స్ లాభాలతో సాగుతున్నాయి. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ అత్యధికంగా 2.12 శాతం లాభంతో ఉండగా.. రియాలిటీ ఇండెక్స్ ఒక శాతానికిపైగా లాభంతో ఉంది. ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ, పవర్ ఇండెక్స్‌లు లాభాలతో కొనసాగుతున్నాయి. మెటల్ సూచీ(Metal index) 1.09 శాతం, ఐటీ 0.87 శాతం నష్టపోయాయి. ఆటో, ఎనర్జీ ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకెక్స్‌లు నష్టాలతో ఉన్నాయి.
Stock Market | పతనానికి కారణాలు..
అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జియో పొలిటికల్ టెన్షన్స్(Geo political tensions), కోవిడ్ భయాలు మార్కెట్లలో అనిశ్చితిని సృష్టిస్తున్నాయి. అల్యూమినియం, ఉక్కు దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) విధించిన 50 శాతం సుంకాలతో గ్లోబల్‌గా మార్కెట్లు మరింత ఒత్తిడికి గురవుతున్నాయి. జపాన్, హాంగ్‌కాంగ్ మార్కెట్లపై ఎక్కువగా నష్టపోతున్నాయి. దీని ప్రభావం మన మార్కెట్లపైనా పడింది.
హెవీవెయిట్ స్టాక్స్ అయిన రిలయన్స్(Reliance), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగాయి. వాటిలో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది.
Stock Market | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 10 కంపెనీలు లాభాలతో సాగుతుండగా.. 20 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. ఎటర్నల్(Eternal) 1.70 శాతం, అదానిపోర్ట్స్ 1.50 శాతం, ఎంఅండ్‌ఎం 1.40 శాతం, హెచ్‌యూఎల్ 0.97 శాతం, పవర్‌గ్రిడ్ 0.74 శాతం లాభాలతో ఉన్నాయి.
Stock Market | Top losers..
టైటాన్(Titan) 1.85 శాతం, టాటా స్టీల్ శాతం 1.43 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.23 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.23 శాతం, టాటా మోటార్స్ 1.17 శాతం, రిలయన్స్ 1.05 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.