Homeబిజినెస్​Stock Market | నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

Stock Market | నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ :Stock Market | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గానే ఉన్నా.. మన స్టాక్‌ మార్కెట్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, కన్జూమర్‌ డ్యూరెబుల్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. బుధవారం ఉదయం 94 పాయింట్ల స్వల్ప నష్టంతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌.. ఇంట్రాడేలో గరిష్టంగా 307 పాయింట్లు కోల్పోయింది. Flatగా ప్రారంభమైన నిఫ్టీ(Nifty).. ఇంట్రాడేలో గరిష్టంగా 89 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌(Sensex) 245 పాయింట్ల నష్టంతో 81,306 వద్ద, నిఫ్టీ 75 పాయింట్ల నష్టంతో 24,751 వద్ద కొనసాగుతున్నాయి.

కోవిడ్‌(Covid) భయాలతో మార్కెట్‌లో స్తబ్ధత నెలకొంది. ఇన్వెస్టర్లు గరిష్టాల వద్ద అమ్మకాలకు పాల్పడుతూ కనిష్టాల వద్ద కొనుగోళ్లు జరుపుతుండడంతో సూచీలు రేంజ్ బౌండ్ లో కొనసాగుతున్నాయి. ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు వరుసగా నెట్‌ బయ్యర్లుగా నిలుస్తున్నా.. తక్కువ మొత్తంలోనే కొనుగోలు చేస్తుండడంతో రిటైల్‌ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు మాత్రం దూకుడు కొనసాగిస్తున్నారు.

Stock Market | రాణిస్తున్న టెలికాం, పీఎస్‌యూ షేర్లు..

టెలికాం(Telecom), పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు రాణిస్తున్నాయి. బీఎస్‌ఈలో టెలికాం ఇండెక్స్‌ 1.95 శాతం పెరగ్గా.. రియాలిటీ సూచీ 0.67 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ 0.63 శాతం, పవర్‌ 0.57 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌, పీఎస్‌యూ ఇండెక్స్‌లు 0. 5 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఇన్‌ఫ్రా(Infra) సూచీలు లాభాల బాటలో ఉన్నాయి. ఎఫ్‌ఎంసీజీ(FMCG) ఇండెక్స్‌ 1.10 శాతం నష్టంతో ఉండగా.. ఆటో, మెటల్‌ ఇండెక్స్‌లు అర శాతానికిపైగా నష్టంతో కొనసాగుతున్నాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.61 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.29 శాతం లాభాలతో ఉండగా.. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ మాత్రం 0.12 శాతం నష్టంతో కదలాడుతోంది.

Stock Market | Top losers..

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 9 కంపెనీలు లాభాలతో సాగుతుండగా.. 21 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. ఐటీసీ(ITC) 3 శాతానికిపైగా నష్టపోగా.. నెస్లే 1.68 శాతం, ఎంఅండ్‌ఎం 1.14 శాతం క్షీణించాయి. ఆసియా పెయింట్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, కొటక్‌ బ్యాంక్‌, టైటాన్‌, హెచ్‌యూఎల్‌, పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా అర శాతానికిపైగా నష్టంతో కదలాడుతున్నాయి.

Stock Market | Top gainers..

అదాని పోర్ట్స్‌(Adani ports) 0.83 శాతం పెరగ్గా.. ఎయిర్‌టెల్‌ 0.64 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 0.63 శాతం లాభంతో కొనసొగుతున్నాయి.

Must Read
Related News