ePaper
More
    Homeబిజినెస్​Stock Market | నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

    Stock Market | నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Domestic stock markets) మంగళవారం నష్టాలతో కొనసాగుతున్నాయి.

    ఉదయం 138 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్‌(Sensex).. ఇంట్రాడేలో గరిష్టంగా 915 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ(NIfty) 45 పాయింట్ల నష్టంతో ప్రారంభమై గరిష్టంగా 264 పాయింట్లు పడిపోయింది. ఐటీ, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు కొంత ఒడిదుడుకులకు లోనయ్యాయి. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌లు కోలుకుంటున్నాయి. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 275 పాయింట్ల నష్టంతో 81,900 వద్ద, నిఫ్టీ 82 పాయింట్ల నష్టంతో 24,918 వద్ద కొనసాగుతున్నాయి.

    రష్యా భూభాగంపై దాడికి ఉక్రెయిన్‌కు జర్మనీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం, రష్టా దీటుగా బదులిస్తుండడంతో జియో పొలిటికల్‌ టెన్షన్స్‌(Geo political tensions) మరింత పెరిగే అవకాశాలున్నాయి. కోవిడ్‌ (Covid) కేసులు పెరుగుతుండడమూ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. విక్స్‌ పెరగడం ఇన్వెస్టర్లలోని ఆందోళనను ప్రతిబింబిస్తోంది. మరోవైపు బుధవారం ఏప్రిల్‌కు సంబంధించిన ఇండియా మాక్రో ఎకనామిక్‌ డాటా విడుదల కానుంది. 30న మన Q4 జీడీపీ(GDP) డాటా కూడా వెలువడనుంది. ఈ నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

    Stock Market | మిశ్రమ స్పందన..

    అన్ని రంగాల షేర్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. బీఎస్‌ఈ(BSE)లో టెలికాం ఇండెక్స్‌ 0.83 శాతం లాభంతో ఉండగా.. క్యాపిటల్‌ గూడ్స్‌ సూచీ 0.70 శాతం, రియాలిటీ(Realty) 0.52 శాతం, కన్జూమర్‌ డ్యూరెబెల్‌ ఇండెక్స్‌ 0.5 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి. ఐటీ సూచీ 0. 28 శాతం నష్టాలతో ఉంది. మిగతా రంగాల షేర్లు స్వల్ప లాభనష్టాలతో కదలాడుతున్నాయి.

    Stock Market | Top Gainers..

    బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 12 కంపెనీలు లాభాలతో సాగుతుండగా.. 18 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌(Indusind bank) 2.6 శాతం పెరగ్గా.. అదాని పోర్ట్స్‌, ఎస్‌బీఐ, ఆసియా పెయింట్స్‌, టాటా స్టీల్‌, నెస్లే అర శాతానికిపైగా లాభంతో కొనసాగుతున్నాయి.

    Stock Market | Top losers..

    అల్ట్రాటెక్‌ సిమెంట్‌(Ultratech cement) 1.87 శాతం నష్టపోగా.. ఎన్టీపీసీ 1.31 శాతం పడిపోయింది. టాటా మోటార్స్‌, ఎటర్నల్‌, ఎంఅండ్‌ఎం, పవర్‌ గ్రిడ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌(Axis bank), ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ అరశాతానికిపైగా నష్టంతో ఉన్నాయి.

    Latest articles

    Kaleshwaram | కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్​ను తిలకించిన నేతలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంగళవారం తెలంగాణ భవన్​లో...

    MLA Komati Reddy | పదవుల కోసం కాళ్లు పట్టుకోను.. అవసరమైతే మళ్లీ త్యాగం చేస్తానన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLA Komati Reddy | మంత్రి పదవి రాక కొంతకాలంగా అసంతృప్తితో తరచూ సంచలన...

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కు పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్...

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    More like this