Homeబిజినెస్​Stock markets | భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 25వేల మార్క్‌కు చేరువలో నిఫ్టీ

Stock markets | భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 25వేల మార్క్‌కు చేరువలో నిఫ్టీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock markets | ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధమేఘాలు తొలగిపోకున్నా స్టాక్‌ మార్కెట్లు(stock markets) మాత్రం పరుగులు తీశాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ప్రధాన సూచీలు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 84 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమై గరిష్టంగా 106 పాయింట్లు కోల్పోయింది. కనిష్ట స్థాయిల వద్ద నుంచి కోలుకుని ఇంట్రాడేలో గరిష్టంగా 953 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ (NIfty) 14 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమైనా అక్కడి నుంచి 29 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల నుంచి ఇంట్రాడేలో గరిష్టంగా 264 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్‌ 677 పాయింట్ల లాభంతో 81,796 వద్ద, నిఫ్టీ 227 పాయింట్ల లాభంతో 24,946 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్‌ఈలో 1,976 కంపెనీలు లాభపడగా 2,108 స్టాక్స్‌ నష్టపోయాయి. 169 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 101 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 71 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. మూడు కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, తొమ్మిది కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

మిడిల్‌ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా సోమవారం ఆసియా మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. వాల్‌స్ట్రీల్‌ ఫ్యూచర్స్‌ సైతం లాభాలతో కొనసాగాయి. మన మార్కెట్లు సైతం వాటిని అనుసరించాయి. యూఎస్‌తో ట్రేడ్‌ డీల్స్‌ త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయన్న అంచనాలతో మార్కెట్లు పాజిటివ్‌గా స్పందించాయి. ఐటీ, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ ప్రధాన సూచీలను పైకి తీసుకువెళ్లాయి.

Stock markets | రాణించిన అన్ని రంగాల షేర్లు..

అన్ని రంగాల షేర్లు రాణించాయి. బీఎస్‌ఈ(BSE)లో అత్యధికంగా ఐటీ ఇండెక్స్‌ 1.50 శాతం పెరిగింది. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌(Oil and gas) ఇండెక్స్‌ 1.22 శాతం, రియాలిటీ 1.21 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్‌ ఇండెక్స్‌ 1.05 శాతం లాభపడ్డాయి. ఇన్‌ఫ్రా, మెటల్‌, ఎనర్జీ, టెలికాం(Telecom), క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాల షేర్లూ భారీ లాభాలతో ముగిశాయి. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.93 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.85 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.38శాతం పెరిగాయి.

Stock markets | Top gainers..

బీఎస్‌ఈలో నమోదైన షేర్లలో స్టెర్‌లైట్‌(Sterlite Technologies) 19.27 శాతం టీవీఎస్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌ 6.42 శాతం, తిరుమలాయ్‌ కెమికల్స్‌ 6.37 శాతం, ఇంద్రప్రస్థ గ్యాస్‌ 6.26 శాతం, గెలాక్సీ సర్ఫెక్టంట్స్ 6.24 శాతం పెరిగాయి.

Stock markets | Top losers..

టాటా మోటార్స్‌(Tata motors) 3.76 శాతం, హాట్సన్‌ ఆగ్రో 3.74 శాతం, వేలార్‌ ఎస్టేట్‌ 3.4 శాతం, న్యూలాండ్‌ లాబ్‌ 3.16 శాతం, రేట్‌గెయిన్‌ 3.09 శాతం నష్టపోయాయి.

Must Read
Related News