Homeబిజినెస్​Stock Market | భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. మరోసారి 25వేల పాయింట్లు దాటిన నిఫ్టీ

Stock Market | భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. మరోసారి 25వేల పాయింట్లు దాటిన నిఫ్టీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) శుక్రవారం లాభాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ(Nifty) మరోసారి 25వేల మార్కును దాటింది. ఉదయం ఫ్లాట్​గా ప్రారంభమైన సెన్సెక్స్(Sensex) ఇంట్రాడేలో గరిష్టంగా 863 పాయింట్లు, నిఫ్టీ 257 పాయింట్లు పెరిగాయి. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 761పాయింట్ల లాభంతో 82,123 వద్ద, నిఫ్టీ 238 పాయింట్ల లాభంతో 25,031 వద్ద కదలాడుతున్నాయి.

Stock Market | అన్ని సెక్టార్లు గ్రీన్​లోనే..

దేశీయ స్టాక్ మార్కెట్​లోని అన్ని సెక్టార్లు లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. బీఎస్ఈ రియాలిటీ(Realty) ఇండెక్స్ అత్యధికంగా 2.12 శాతం పెరిగింది. టెలికాం ఇండెక్స్ 1.87 శాతం, పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 1.76 శాతం, పవర్ 1.66 శాతం, పీఎస్యూ ఇండెక్స్ 1.6 శాతం, మెటల్ (Metal) ఇండెక్స్ 1.53 శాతం, ఇన్ఫ్రా సూచి 1.43 శాతం లాభాలతో సాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.98 శాతం, లార్జ్ క్యాప్ 0.98 శాతం, స్మాల్ క్యాప్ 0.82 శాతం లాభాలతో ఉన్నాయి.

Stock Market | మార్కెట్ పెరగడానికి కారణాలు..

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నా.. వెంటనే అమెరికా(America) ఇప్పట్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకునే అవకాశాలు లేకపోవడంతో మార్కెట్లు పాజిటివ్‌గా మారాయి. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొని ఉన్నా ఎఫ్‌ఐఐలు వరుసగా మూడు ట్రేడింగ్‌ సెషన్లలో నెట్‌ బయ్యర్లుగా ఉండడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ బలపడింది. శుక్రవారం ఉదయం రూపాయి(Rupee) విలువ బలపడడం, ముడి చమురు ధర దిగివస్తుండడం, విక్స్‌ మరింత తగ్గడం, ఇండెక్స్‌ హెవీవెయిట్‌ స్టాక్స్‌ అయిన రిలయన్స్‌(Reliance), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌ లాభాల బాటలో పయనిస్తుండడంతో ఇన్వెస్టర్లు(Investtors) కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మార్కెట్లు పెరుగుతున్నాయి.

Stock Market | Top gainers..

బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్​లో 27 స్టాక్స్ లాభాలతో ఉండగా 3 మాత్రమే నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎంఅండ్ఎం(M&M) 2.59 శాతం, పవర్ గ్రిడ్ 1.97 శాతం, ఎయిర్టెల్ 1.89 శాతం, ఎస్బీఐ 1.66 శాతం, టాటా స్టీల్ 1.39 శాతం లాభాలతో ఉన్నాయి.

Stock Market | Losers..

మారుతి(Maruti) 0.37 శాతం, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ 0.15 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.

Must Read
Related News