అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Stock Market | మిడిల్ ఈస్ట్(Middle East)లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్ 84 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమై గరిష్టంగా 106 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని ఇంట్రాడేలో గరిష్టంగా 769 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ(Nifty) 14 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమైనా అక్కడినుంచి 29 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద లభించిన మద్దతుతో ఇంట్రాడేలో గరిష్టంగా 227 పాయింట్లు లాభపడింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 536 పాయింట్ల లాభంతో 81.655 వద్ద, నిఫ్టీ 179 పాయింట్ల లాభంతో 24,897 వద్ద కొనసాగుతున్నాయి.
మార్కెట్‌లో అస్థిరతకు కొలమానమైన విక్స్(VIX) సోమవారం ఉదయం 1.8 శాతం తగ్గడంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. భారత్, యూఎస్‌ల మధ్య వాణిజ్య ఒప్పందం(Trade agreement) విషయంలో పురోగతి ఉందన్న వార్తలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచాయి. ఇజ్రాయిల్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నా డౌజోన్స్ ఫ్యూచర్స్‌తోపాటు ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. జపాన్, దక్షిణ కొరియా, చైనా(China) మార్కెట్లు లాభాలతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు సైతం లాభాల బాటలో పయనిస్తున్నాయి.
Stock Market | ఐటీలో దూకుడు
పీఎస్‌యూ బ్యాంక్ సెక్టార్ మినహా ప్రధాన రంగాల స్టాక్స్ లాభాల బాటలో పయనిస్తున్నాయి. బీఎస్‌ఈ(BSE)లో అత్యధికంగా ఐటీ ఇండెక్స్ 1.18 శాతం లాభంతో కదలాడుతోంది. పీఎస్‌యూ బ్యాంక్(PSU bank) ఇండెక్స్ 0.20 శాతం మేర పతనమైంది. రియాలిటీ, బ్యాంకెక్స్, ఇన్‌ఫ్రా, పవర్, మెటల్, ఎనర్జీ, టెలికాం, ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్‌లు అరశాతం మేర లాభాలతో కొనసాగుతున్నాయి. లార్జ్ క్యాప్ ఇండెక్స్(Large cap index) 0.70 శాతం, మిడ్ క్యాప్ 0.32 శాతం లాభాలతో ఉండగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.32 శాతం నష్టాలతో ఉంది.
Stock Market | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 5 స్టాక్స్ మాత్రమే నష్టాలతో ఉండగా 25 స్టాక్స్ లాభాలతో కొనసాగుతున్నాయి. టీసీఎస్(TCS) 1.49 శాతం, ఎల్‌అండ్‌టీ 1.39 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.37 శాతం, టెక్‌మహీంద్రా 1.36 శాతం, మారుతి 1.09 శాతం లాభాలతో కదలాడుతున్నాయి.
Stock Market | Losers..
టాటా మోటార్స్(Tata motors) 4.13 శాతం నష్టపోగా.. సన్‌ఫార్మా 0.48 శాతం, అదానిపోర్ట్స్ 0.46 శాతం, ఎస్‌బీఐ 0.26 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 0.10 శాతం నష్టాలతో ఉన్నాయి.