అక్షరటుడే, వెబ్డెస్క్ : Stock Market | గ్లోబల్ క్యూస్ బలహీనంగా ఉండడం, యూఎస్, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం విషయంలో నెలకొన్న అనిశ్చితి కొనసాగుతుండడం తో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్(Sensex) 145 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా.. అక్కడ నుంచి 72 పాయింట్లు పెరిగింది. అనంతరం అమ్మకాల ఒత్తిడితో ఇంట్రాడే గరిష్టాల నుంచి 775 పాయింట్లు కోల్పోయింది. 52 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ(Nifty).. అక్కడి నుంచి 41 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే(Intraday) గరిష్ట స్థాయి నుంచి 248 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 765 పాయింట్ల నష్టంతో 79,775 వద్ద, నిఫ్టీ 232 పాయింట్ల నష్టంతో 24,363 వద్ద నిలిచాయి.
Stock Market | అన్ని రంగాల్లో సెల్లాఫ్.
అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. బీఎస్ఈ(BSE)లో రియాల్టీ 2.09 శాతం, మెటల్(Metal) ఇండెక్స్ 1.82 శాతం, టెలీకాం 1.83 శాతం, కమోడిటీ 1.55 శాతం, కన్జ్యూమర్ డ్యూరేబుల్స్ 1.68 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.62 శాతం, ఆటో 1.40 శాతం, హెల్త్ కేర్ 1.11 శాతం, బ్యాంకెక్స్ 1.04 శాతం, ఐటీ 1.01 శాతం నష్టాలతో ముగిసాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.56 శాతం పతనమవగా.. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 1.04 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.03 శాతం నష్టపోయాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ లో 5 కంపెనీలు లాభపడగా.. 25 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టైటాన్(Titan), ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ట్రెంట్, ఐటీసీ మాత్రమే లాభపడ్డాయి.
Top Losers : ఎయిర్టెల్, టాటా మోటార్, కొటక్ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఆక్సిస్ బ్యాంకు నష్టపోయాయి.
