అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic Stock Markets) నష్టాల బాటలో సాగుతున్నాయి. వరుసగా రెండోరోజూ నష్టాలతో ముగిశాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 25 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా అక్కడినుంచి 333 పాయింట్లు పెరిగింది.
గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడితో క్రమంగా కిందికి దిగజారుతూ 747 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ(
Nifty) 14 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 90 పాయింట్లు ఎగబాకింది. అక్కడినుంచి 242 పాయింట్లు పడిపోయింది.  చివరికి సెన్సెక్స్(Sensex) 465 పాయింట్ల నష్టంతో 83,938 వద్ద, నిఫ్టీ 155 పాయింట్ల నష్టంతో 25,722 వద్ద స్థిరపడ్డాయి.
మెటల్, పవర్ సెక్టార్లలో సెల్లాఫ్..
మెటల్(Metal), పవర్, యుటిలిటీ సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్ రాణించాయి. బీఎస్‌ఈలో యుటిలిటీ ఇండెక్స్ 1.28 శాతం, మెటల్ 1.15 శాతం, పవర్ 1.03 శాతం, సర్వీసెస్ 0.91 శాతం, కమోడిటీ, క్యాపిటల్ మార్కెట్ 0.90 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్, ఇన్‌ఫ్రా ఇండెక్స్‌లు 0.70 శాతం నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంక్(PSU bank) ఇండెక్స్ 1.71 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.41 శాతం, ఇండస్ట్రియల్ 0.36 శాతం, పీఎస్‌యూ 0.31 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.24 శాతం పెరిగాయి. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.55 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.55 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.40 శాతం నష్టపోయాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,784 కంపెనీలు లాభపడగా 2,370 స్టాక్స్ నష్టపోయాయి. 155 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 136 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 66 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 3 కంపెనీలు అప్పర్ సర్క్యూట్(Upper circuit)ను, 9 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 5 కంపెనీలు లాభాలతో ఉండగా.. 25 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. బీఈఎల్ 3.95 శాతం, ఎల్‌టీ 1.09 శాతం, టీసీఎస్ 0.73 శాతం, ఐటీసీ 0.37శాతం, ఎస్‌బీఐ 0.31 శాతం పెరిగాయి.
Top Losers : ఎటర్నల్ 3.52 శాతం, ఎన్టీపీసీ 2.39 శాతం, కొటక్ బ్యాంక్ 1.57 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.28 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.25 శాతం నష్టపోయాయి.