ePaper
More
    Homeబిజినెస్​Stock Market | భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

    Stock Market | భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Stock Market | ఆసియా మార్కెట్లు(Asia markets) పాజిటివ్‌గా ఉన్నా దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) మాత్రం తీవ్ర ఒడిదుడుకుల మధ్య నష్టాలలో ట్రేడ్‌ అవుతున్నాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 37 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమైంది. అక్కడినుంచి 428 పాయింట్లు క్షీణించిన సూచీ.. వెంటనే నాలుగు వందలకుపైగా పాయింట్లు పెరిగింది. ఫ్లాట్‌గా ప్రారంభమైన నిఫ్టీ(Nifty) అమ్మకాల ఒత్తిడికి గురై 108 పాయింట్లు నష్టపోయింది. కనిష్టాల వద్ద లభించిన మద్దతుతో కోలుకుని 110 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు దిగడంతో నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 412 పాయింట్ల నష్టంతో 82,088 వద్ద, నిఫ్టీ 116 పాయింట్ల నష్టంతో 25,033 వద్ద కొనసాగుతున్నాయి.

    Stock Market | ఐటీలో కొనసాగుతున్న పతనం..

    ఐటీ స్టాక్స్‌(IT stocks)లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌ 1.19 శాతం నష్టపోగా.. క్యాపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ 0.30 శాతం, ప్రైవేట్‌ బ్యాంక్‌ సూచీ 0.29 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 0.25 శాతం, టెలికాం సూచీ 0.25 శాతం నష్టాలతో ఉన్నాయి. పీఎస్‌యూ బ్యాంక్‌(PSU Bank) 0.78 శాతం పెరగ్గా… యుటిలిటీ, హెల్త్‌కేర్‌ సూచీలు 0.63 శాతం, పవర్‌ ఇండెక్స్‌ 0.40 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.36 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.12 శాతం లాభాలతో ఉండగా.. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.31 శాతం నష్టాలతో కదలాడుతోంది.


    Top Gainers:బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్‌లో 10 కంపెనీలు లాభాలతో 20 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. ఎటర్నల్‌ 2.26 శాతం, సన్‌ఫార్మా 0.61 శాతం, ఐటీసీ 0.49 శాతం, టైటాన్‌ 0.43 శాతం, అదానీ పోర్ట్స్‌ 0.42 శాతం లాభాలతో సాగుతున్నాయి.

    Top Losers:టెక్‌ మహీంద్రా 1.71 శాతం, ఇన్ఫోసిస్‌ 1.60 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.57 శాతం,బజాజ్‌ ఫైనాన్స్‌ 1.54 శాతం, టీసీఎస్‌ 2.70 శాతం నష్టాలతో ఉన్నాయి.

    More like this

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...

    IPO | ఐపీవోకు మంగళ సూత్రాల తయారీ కంపెనీ.. నేడు సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | మంగళసూత్రాలు తయారు చేసే శ్రింగార్‌ హౌస్‌ ఆఫ్‌ మంగళసూత్ర ఐపీవోకు వచ్చింది....

    Terrorists Arrest | ఐసిస్ ఉగ్ర‌వాదుల‌ అరెస్టు.. రాంచీ, ఢిల్లీలో ప‌ట్టుబ‌డిన నిందితులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terrorists Arrest | ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ర్య‌ల్లో భ‌ద్ర‌తా ద‌ళాలు కీల‌క విజ‌యం సాధించాయి....