అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | అంతర్జాతీయ అనిశ్చిత(International uncertainty) పరిస్థితుల ప్రభావంతో మన స్టాక్ మార్కెట్లూ నష్టాలతో సాగుతున్నాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్(Sensex) 56 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమై ఇంట్రాడేలో గరిష్టంగా 401 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ(Nifty) 70 పాయింట్ల లాభంతో ప్రారంభమై గరిష్టంగా 129 పాయింట్లు లాభపడింది. అయితే ఇన్వెస్టర్లలో ఆనందం ఎంతోసేపు నిలవలేదు. మార్కెట్లు ప్రారంభమైన కొంతసేపటికే సూచీలు నేలచూపులు చూశాయి. ఇంట్రాడే గరిష్టాల నుంచి సెన్సెక్స్ క్రమంగా 1,199 పాయింట్లు, నిఫ్టీ 343 పాయింట్లు కోల్పోయాయి. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 579 పాయింట్ల నష్టంతో 80,799 వద్ద, నిఫ్టీ 153 పాయింట్ల నష్టంతో 24,559 వద్ద కొనసాగుతున్నాయి. రియాలిటీ(Realty) సెక్టార్ మినహా మిగతా అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. లార్జ్‌క్యాప్ స్టాక్స్ ఎక్కువగా నష్టపోతున్నాయి. బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో ఎంఅండ్‌ఎం మినహా మిగతా అన్ని స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి.
Stock Market | పతనానికి కారణాలు..
రష్యా(Russia), ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్తతలు, చైనా, యూఎస్‌ల మధ్య వాణిజ్య ఉల్లంఘన ఆరోపణలు, అమెరికా ప్రతిపాదించిన న్యూక్లియర్ డీల్‌ను ఇరాన్ తోసిపుచ్చడం వంటి కారణాలతో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. వీటికి తోడు జియో పొలిటికల్ టెన్షన్స్‌తో గ్లోబల్ మార్కెట్లు(Global markets) ప్రతికూలంగా స్పందిస్తున్నాయి. ఇదే సమయంలో మన మార్కెట్లనుంచి ఎఫ్‌ఐఐలు పెట్టుబడులను ఉపసంహరిస్తున్నారు. దీంతో మార్కెట్లలో ఒత్తిడి నెలకొంది. ఆర్‌బీఐ ఎంపీసీ నేపథ్యంలోనూ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
Stock Market | Top gainers..
నిఫ్టీ 50 ఇండెక్స్‌లో ఏడు స్టాక్స్ లాభాలతో ఉండగా.. 43 స్టాక్స్ నష్టాల బాటలో పయనిస్తున్నాయి. నిఫ్టీ 50లో శ్రీరాంఫైనాన్స్(Shriram finance) 1.44 శాతం లాభపడగా.. గ్రాసిం 1.06 శాతం, బజాజ్ ఆటో 0.83 శాతం, ఎంఅండ్‌ఎం 0.57 శాతం లాభాలతో ఉన్నాయి.
Stock Market | Top losers..
నిఫ్టీ 50 ఇండెక్స్ లో అదానీ పోర్ట్స్(Adani ports) 2.66 శాతం నష్టపోగా.. బజాజ్ ఫిన్‌సర్వ్ 2.18 శాతం, కోల్ ఇండియా 2.10 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 1.97 శాతం, పవర్‌గ్రిడ్ 1.64 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.57 శాతం, అపోలో హాస్పిటల్స్ 1.52 శాతం నష్టాల్లో ఉన్నాయి.